‘దేవర’, ‘వార్ 2’ సినిమాలతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని (ఎన్టీఆర్ నీల్) నిర్మించనుంది. ఆగస్టు నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే ఇంతకుముందు కూడా ఇలాగే షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.. కానీ ‘దేవర’ ఆలస్యం కారణంగా ఈ సినిమా మొదలుకాలేదు. దీంతో మరోసారి అలాగే జరుగుతుందా అనే అనుమానం అభిమానుల్లో ఉంది. అయితే ఈసారి ఎటువంటి డౌట్స్ అక్కర్లేదని, ఈసారి అనుకున్నట్టు టైంకి ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.
‘దేవర’, ‘వార్ 2’ చిత్రాలను ఆగస్టు లోపు పూర్తి చేసి, ఆ తర్వాత తన పూర్తి ఫోకస్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై పెట్టాలని ఎన్టీఆర్ కోరుకుంటున్నాడట. ఆగస్టు ద్వితీయార్థంలో లేదా సెప్టెంబర్ ప్రథమార్థంలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ మెక్సికోలో జరగనుందట. మొత్తం 15 దేశాల్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకోనుంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని గతంలో ప్రశాంత్ నీల్ చెప్పాడు. ఈ చిత్రం ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారట.