నిర్ణయం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. కాలంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మనిషి నిర్ణయాలు తీసుకుంటాడు. అయితే సినీ, రాజకీయ రంగాల వారు తీసుకునే నిర్ణయలు మాత్రమే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో హీరోయిన్స్ తీసుకునే డెసిషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలా బ్యూటీలు తీసుకునే నిర్ణయం వారి ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతుంది. ఒకరికి మించి మరోకరు క్రేజీ క్రేజీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ బ్యూటీ తీసుకున్న నిర్ణయం మాములుగా లేదు. మరి.. ఆ హీరోయిన్ ఎవరు, ఆ నిర్ణయం ఏమిటో ఇప్పుడు చూద్దాం…
మృణాల్ ఠాగూర్.. ఈ పేరు గురించి టాలీవుడ్ ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీతారామం సినిమాలో సీతా పాత్రలో ఆమె నటించిన తీరు తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం తీసుకొచ్చింది. ఆ సినిమాతో ఈ అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. మొదట మృణాల్ ఠాకూర్ పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే మృణాల్ ను స్టార్ చేసింది మాత్రం సీతారామ మూవీని. ఈ సనిమా తర్వాత క్రేజీ ఆఫర్‌లకి స్టార్ హీరోయిన్ మారిపోయింది.
ఇది ఇలాఉంటే.. ఈ అమ్మడు తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ గా మారింది. ఇటీవలే మృణాల్ తీసుకున్న నిర్ణయం మిగతా హీరోయిన్స్ కి చెమటలు పట్టేలా చేస్తుంది. గతంలో తండ్రికి ఇచ్చిన మాట కోసం బోల్డ్ రోల్స్ లో నటించకూడదు అనే నిర్ణయం తీసుకుందని టాక్. దీంతో ఈ అమ్మడికి అవకాశాలు సరిగ్గా రాలేదంట. ఎలాగైనా సరే మళ్లీ తనకు పునర్ వైభవం తెచ్చుకోవాలి బోల్డ్ పాత్రలో నటించడానికి ఓకే చెప్పేస్తుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఈ అమ్మడి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
ఇంత వైలెంట్ నిర్ణయం ఎందుకు తీసుకుందని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కి ఉన్న హైట్, అందం, అభినయానికి పెద్ద పెద్ద స్టార్ హీరోలా చాలా చక్కగా ఉంటుంది. అయితే ఆమె పెట్టుకున్న కొన్ని పరిధుల కారణంగానే ఆమెకు ఛాన్స్ రావడం లేదని టాక్. ఇప్పుడు ఆ కండిషన్స్ ని కూడా బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది మృణాల్ ఠాకూర్ అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా మిక్స్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ బ్యూటీ ఫెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు వచ్చాయి.