తెలుగు బుల్లితెరపై ఎన్నో కామెడీ సీరియల్స్, ప్రోగ్రామ్స్ వచ్చాయి. కానీ ‘జబర్ధస్త్’ కామెడీ షోకి వచ్చిన క్రేజ్ దేనికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కళాకారులు తమ టాలెంట్ చూపించి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రతిరోజూ వెరైటీ స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వారు. ప్రస్తుతం బుల్లితెర, వెండి తెరపై స్టార్లుగా రాణిస్తున్నారు. తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్, పటాస్ కామెడీ షో ద్వారా తమదైన కామెడీ పండించి బాగా పాపులర్ అయ్యారు. జబర్ధస్త్ కామెడీ షోలో తన అల్లరితో ప్రేక్షకులను అలరించిన అమ్మాయి..ఇప్పుడు హీరోయిన్‌లా తయారైంది. ఇంతకీ ఆ అల్లరి పిల్ల ఎవరు? అన్నవిషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే.
సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి రీల్స్, యూట్యూబ్ వీడియోలు, షార్ట్‌లతో తమ టాలెంట్ చూపిస్తూ పాపులర్ అవుతున్నారు. పాటలు పాడటం, డ్యాన్స్, సాహసవంతమైన పనులు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం బుల్లితెరపై యోధ సిస్టర్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అత్తా కోడళ్ళుగా తమదైన కామెడీ పండిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. జనాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. యోధా చందు జబర్ధస్త్, పటాస్ కామెడీ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. తనదైన ముద్దు ముద్దు మాటలతో క్యూట్ లుక్ తో యోధ అందరి మనసు దోచింది. చిన్నవయసులోనే ఈ అమ్మడు తన డైలాగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
చాలా సంవత్సరాల పాటు తెలుగు ప్రేక్షకులను నవ్వించిన యోధ చందు కొంత కాలం తర్వాత కనిపించకుండా పోయింది. పై దృష్టి సారించడంతో కెరీర్ కి బ్రేక్ చెప్పాల్సి వచ్చిందని అప్పట్లో చదువు వార్తలు వచ్చాయి. చాలా కాలం తర్వాత ఆ అమ్మడు సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం యోధ పెద్దదయ్యింది.. అచ్చం హీరోయిన్ లా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో.. తనకు సంబంధించిన ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది. అప్పటికీ.. ఇప్పటికీ యోధను చూస్తే చాలా తేడా అనిపిస్తుంది. అచ్చం హీరోయిన్ లుక్ తో ఆకట్టుకుంటుంది. మరి వెండితెరపై ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతుందేమో అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.