స్వాతిలో ముత్యమంతా ముద్దుల ముట్టుకుంది సంధ్య వాన.. సందెలో చీకటంతా సిగ్గులా అంటుకుంది లోనలోనా.. నందమూరి బాలకృష్ణ (balakrishna)హీరోగా 1993 లో వచ్చిన బంగారు బుల్లోడు మూవీలోని ఈ పాట.. ఇందులో బాలయ్య స్టెప్ లకి సరే ధీటుగా డాన్స్ చేసిన భామ రవీనా టాండన్( రావేనా) పాట మర్చిపోలేము..అలాగే రవీనా ని మర్చిపోలేము. ఆమెకు సంబంధించిన తాజా వార్త వైరల్ గా మారింది.
ముంబైలోని అత్యంత ఖరీదు ప్రాంతం బాంద్రా. రీసెంట్ గా ఏరియాలో రవీనా, ఆమె డ్రైవర్ మీద దాడి జరిగింది. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు మాపై దాడి చెయ్యకండి అంటూ రవీనా ప్రాధేయపడినట్టుగా ఒక వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. అదే విధంగా రవీనా ఆమె డ్రైవర్ మద్యం తాగి ఉన్నారని ఫలితంగా రాష్ డ్రైవింగ్ చేసి కొంత మందిని గాయపరిచారని పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం మొత్తం పైన క్లారిటీ వచ్చింది. దర్యాప్తు చేసిన పోలీసులే స్వయంగా వివరణ ఇచ్చారు. సంఘటన జరిగిన బాంద్రా రోడ్ లోని సి సి ఫుటేజ్ ని పరిశీలించాం. రవీనా కారు డ్రైవర్ కారు ని పార్కింగ్ చెయ్యడానికి వెనక్కి తెస్తున్నాడు.అదే టైం లో ఒక ఫ్యామిలీ కారు వెనుక బాగానే నడుచుకుంటూ వెళ్తుంది. రివర్స్ చేసేటప్పుడు వెనుక ఎవరైనా ఉన్నారా లేదా అనేది చూసుకోవాలంటూ డ్రైవర్ తో గొడవకి దిగారు. ఆ కాస్త గొడవ పెరగడంతో రవీనా అక్కడికి వచ్చి వారి నుంచి డ్రైవర్ ని రక్షించే పని చేసింది.
ఇదే అక్కడ జరిగింది. అంతే కానీ రవీనా మద్యం తాగడం కానీ వాళ్ళని బతిమాలాడటం గాని జరగలేదని పోలీసులు తేల్చి చెప్పారు. ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ నుంచి రవీనా కి మద్దతు లభించింది. దాడి చేసిన ఘటనలో ఎక్కువ మంది ఉండి ఉంటే రవీనా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేది. మళ్ళీ ఇలాంటివి జరగకుండా నిందితులని కఠినంగా శిక్షించాలని కోరింది.పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా రవీనా కి తమ సంఘీభావాన్ని తెలియచేస్తున్నారు.