కొంతమంది భర్తలే లోకంగా, భార్యే ప్రపంచంగా జీవిస్తారు. వారి శ్రేయస్సు కోసం దేవాలయాలను సందర్శిస్తారు. దేవుళ్లను మొక్కుతుంటారు. అక్కడ మేర కాలినడకన వెళ్లి మరీ మొక్కులు తీర్చుకుంటారు. ఇటీవల ఓ వ్యక్తి తన బావమరిది కోసం ఏకంగా 70 కి.మీ. మోకాళ్ళపై నడిచి ప్రేమను చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బావమరిది త్వరగా కోలుకుంటే ఐనవోలు మల్లన్న ఆలయానికి మోకాళ్లపై నడుచుకుంటూ వస్తానని మొక్కుకున్నాడు. బావమరిది ఆరోగ్యం కుదుటపడడంతో మొక్కు చెల్లించుకున్నాడు. ఇలా తాము అనుకున్నది జరిగితే మొక్కు చెల్లించుకునేది ఒకరు.. అనుకున్నది జరగాలి అంటూ అంగ ప్రదక్షిణలు చేసేవారు కొందరు.
తాజాగా ఒక సీనియర్ హీరో తన భార్య కోసం గుడిలో అంగ ప్రదక్షిణలు చేశారు. ఆ హీరో అనేక తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలతో నటించారు. ఈయన కూతురు కూడా ఇప్పుడు ఒక స్టార్ నటి అయిపోయింది. ఒక పక్క నెగిటివ్ రోల్స్ చేస్తూ.. మరో పక్క లీడ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్నారు. ఆమె బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో కూడా నటించారు. ఆమె మరెవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె తండ్రే ఇప్పుడు సినీ నటి రాధిక శరత్ కుమార్ గుడిలో అంగ ప్రదక్షిణలు చేశారు.
దీనికి కారణం రాధికా శరత్ కుమార్ మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో విరుద్ నగర్ బీజేపీ ఎంపీగా పోటీ చేశారు. తొలివిడతలో భాగంగా తమిళనాడులో ఏప్రిల్ 19న ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాల వెల్లడి కారణంగా.. రాధిక గెలవాలని నటుడు, బీజేపీ నేత శరత్ కుమార్ విరుద్ నగర్ లోని శ్రీ పరాశక్తి మరియమ్మన్ గుడిలో అంగ ప్రదక్షిణలు చేశారు. ఆయన భార్యతో పాటు నరేంద్ర మోదీ కూడా ప్రధానిగా గెలవాలని.. మూడోసారి ఆయన ప్రధాని కావాలని.. ఎంపీగా రాధికా విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగానే భార్య రాధిక, సన్నిహితుల సమక్షంలో ఆయన పొర్లు దండాలు పెట్టారు. శరత్ కుమార్ తో పాటు రాధిక కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టైమ్స్ క్లిప్
భార్య రాధిక కోసం అంగప్రదక్షణం చేసిన శరత్‌కుమార్!#శరత్ కుమార్ #రాధికాశరత్ కుమార్ #ఎన్నికలు 2024 #ఎన్నికల ఫలితం #TimesClip #టోర్టమిల్ pic.twitter.com/O0kGNQoJux
— టైమ్స్ ఆఫ్ రిపబ్లిక్ తమిళ్ (@timeofrepublic) జూన్ 3, 2024