సినిమా ఇండస్ట్రీలోకి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి అవకాశాలు అందుకోవాలంటే మామూలు విషయం కాదు. ఎన్నో కష్టాలను, నష్టాలను ఓర్చుకుని నిలబడినా.. సక్సెస్ ఆశ కూడా ఉండదు. అందుకే పరిశ్రమకు రావడానికి చాలా మంది వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఇక కొందరు అన్నింటికి తెగించి వస్తుంటారు. అలా వచ్చిన వారు కష్టాల కడలిలో ఎదురీదక తప్పదు. అయితే ఎలాగో అలా పరిశ్రమకు వచ్చాక అన్ని రకాల పాత్రలు చేయవలసి ఉంటుంది. అందులో కొన్ని మనసుకు నచ్చనివి కూడా ఉంటాయి. అలా తాను కూడా మనసుకు నచ్చకపోయినా అందుకోసమే అడల్ట్ మూవీస్ చేశానని ప్రముఖ నటుడు షాకింగ్ విషయాలను వెల్లడించాడు.
దుర్గేశ్ కుమార్.. బీహార్ కు చెందిన ఇతడు 2001 ఇంజినీరింగ్ చేయడం కోసం ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ చదువువైపు కష్టంగా ఉండటంతో.. నటన అడుగులు వేశాడు. ఓవైపు నాటకాల్లో నటిస్తూనే.. డిగ్రీ పూర్తి చేశాడు. నేషనల్ డ్రామా స్కూల్ లో యాక్టింగ్ కోర్స్ కూడా చేశాడు. ఆ తర్వాత ‘హైవే’ మూవీలో అవకాశం రావడంతో.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. సుల్తాన్, ఫ్రీకీ అలీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఈ మూడు సినిమాల్లో నటించినప్పటికీ.. అతడికి కష్టాలు తప్పలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బుల కోసం అడల్ట్ సినిమాల్లో నటించానని తొలిసారి చెప్పుకొచ్చాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దుర్గేశ్ కుమార్ మాట్లాడుతూ..”2016లో నేను ముంబైకి వచ్చాను. ఇక్కడ కొందరు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. దాంతో మేమందరం గ్రూప్ గా మారి అవకాశాల కోసం తిరిగే వాళ్లం. నాకు యాక్టింగ్ అంటే పిచ్చి.. అదిలేకుండా నేను బతకలేను. అందుకే వచ్చిన ప్రతీ సినిమా చేసుకుంటూ పోయాను. డబ్బుల కోసం కొన్ని అడల్ట్ మూవీస్ కూడా చేశాను. హైవే, ఫ్రీకీ అలీ, సుల్తాన్ సినిమాల్లో నటించిన తర్వాత కూడా నేను అవకాశాల కోసం క్యాస్టింగ్ డైరెక్టర్ల కాళ్ల మీద పడ్డాను. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత కూడా ఆడిషన్స్ కు వెళ్తే ఏదోలా ఉంటుంది. కానీ ఏం చేస్తాం. అలా ‘పంచాయత్’ మెుదటి సీజన్ లో చిన్న రోల్ చేశాను. రెండున్నర గంటల్లో దీన్ని షూట్ చేశారు” అని తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చాడు ఈ నటుడు. డబ్బుల కోసం అడల్ట్ సినిమాలు చేశానని ఓ నటుడు చెప్పుకురావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
- ఇదికూడా చదవండి: ఈ ఫొటోలోని బుడ్డోడు ఇప్పుడు మల్టీ ట్యాలెంటెడ్ హీరో! గుర్తుపట్టారా?