ఎంతో మంది కమెడియన్స్ మనల్ని నవ్వులతో కితకితలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా మేల్ డామినేషన్ ఎక్కువ. చాలా తక్కువ మంది మాత్రమే ఫీమేల్ కమెడియన్స్ ఉన్నారు. ఒకప్పుడు గీతాంజలి, గిరిజ, రమ ప్రభ వంటి లేడీ హాస్యనటీమణులు తమదైన చమక్కులతో కట్టిపడేసేవారు. ఆ తర్వాత కల్పనారాయ్, శ్రీలక్ష్మి తమ నటనతో నవ్వులు పూయించారు. ఆ తర్వాత కోవై సరళ కనబడితేనే పెదాలన్నీ విప్పరిపోతుంటాయి. తెలంగాణ శకుంతల, గీతా సింగ్, హేమ వంటి కమెడియన్స్ మాత్రమే కాదు.. విద్యుల్లేఖ రామన్ వంటి ఇప్పటి హాస్యనటీమణులు కూడా కడుపుబ్బా నవ్వించారు. ఇదిగో ఈ ఫోటోలో అమ్మడు కూడా ఆ వారసత్వాన్ని తీసుకుంది.
ఈ ఫోటోలో అమ్మాయిని గుర్తు పట్టారా..? ఇప్పుడు తన యాక్టింగ్ తో కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తుంది. బుల్లితెర నుండి వెండి తెరపైకి వచ్చి అక్కడ సత్తా చాటుతుంది. ఇందులో చీర కట్టుతో నాజూగ్గా ఫోటోలకు ఫోజులిస్తున్న ఈమె ఇప్పుడు స్టార్ కమెడియన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముందుగా స్మాల్ స్క్రీన్‌పై ఓ సీరియల్ చేసింది. అందులో ఆమె నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఆ తర్వాత మెల్లిగా ఓ టీవీ ప్రోగ్రాంలో ఎంటరై నవ్వుతోంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరంటే.. అల్లరి పిల్ల రోహిణి రెడ్డి. విశాఖ పట్నంలో పుట్టి పెరిగిన రోహిణి.. నటనపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చేసింది. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం ధారావాహికలో నటించింది . ఇందులో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
మాటీవీలో ప్రసారమైన శ్రీనివాస కళ్యాణంతో పాటు స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ చేసింది. 2019లో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంది. అక్కడ నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది రోహిణీ. అటు ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌లోకి కూడా ఎంటరైంది. అక్కడ ఓ లేడీ టీం ఏర్పాటు చేసుకుని టీమ్ లీడర్ అయ్యింది. అలాగే బిగ్ స్క్రీన్ పై కూడా అడుగు పెట్టింది. భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు, మత్తు వదలరా, బంగారాజు చిత్రంలో కృతి శెట్టి ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపించింది. హ్యపీ బర్త్ డేతో పాటు హనుమాన్ మూవీలో కూడా నటించింది. కానీ ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌తోనే. సీజన్ 1తో పాటు సీజన్ 2 కూడా సక్సెస్ అయిన సంగతి విదితమే. ఇందులో అభినవ్ గోమఠం .. రోహిణి మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా అలరిస్తుంటాయి. అటు బుల్లితెరపై రాణిస్తూ.. ఇటు వెండితెరపై కమెడియన్‌గా అవకాశాలను కొల్లగొడుతుంది.