సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(sai dharam tej)కి తన మావయ్య పవన్ కళ్యాణ్ (pawan kalyan)అంటే ఎంత అభిమానమో అందరకీ తెలుసు. నేను సినిమాల్లోకి రావడానికి కారణం కూడా పవన్ మావయ్యే అని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఒక పక్కన మొన్న జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి వార్తలు వస్తుంటే తాజాగా ఒక ట్వీట్ చేసాడు. ఒక పిక్ ని కూడా షేర్ చేసాడు. ఇప్పుడు అది వైరల్ గా మారింది
పవన్ ఈ ఎన్నికల్లో పిఠాపురం(పిఠాపురం)అసెంబ్లీ నుంచి పోటీ చేసాడు. ప్రస్తుతం మెజారిటీ దిశగా దూసుకుపోతున్నాడు. రౌండ్ రౌండ్ కి మెజారిటీ వేల సంఖ్యలో వస్తుండంతో లక్ష ఓట్ల మెజారిటీ దాటవచ్చనే మాటలు వినపడుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత భవిష్యత్తు ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉంది అంటూ ట్వీట్ చేసాడు. పైగా పవన్ కళ్యాణ్ ఒడిలో ఒక పాప భద్రంగా ఉన్న పిక్ ని కూడా షేర్ చేసాడు. పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పాప ని ఎత్తుకున్నాడు. ఆ పిక్ ని చూసిన ఎవరికైనా పవన్ కాజువల్ గా ఎత్తుకోలేదని అర్ధమవుతుంది. నీ భవిష్యత్తు కి నాది భరోసా అనే నమ్మకాన్ని ఇచ్చినట్టుగా.కామెంట్స్ కూడా అదే విధంగా ఉంటుంది.
పవన్ గెలుపుని కోరుతూ తేజ్ పిఠాపురంలో ప్రచారం కూడా చేసాడు. ఆ సందర్భంలో కొంత మంది ఆకతాయిలు బీరు సీసాలతో ఆయన మీద దాడి కూడా చేసారు. అయినా సరే మొక్కవోని దీక్షతో తన ప్రచారాన్ని పూర్తి చేసి పూర్తి చేసాడు. ఇప్పుడు పవన్ గెలవబోతున్నాడనే వార్తతో ఎంతో ఆనందంతో ఉన్నాడు.అదే విధంగా తనపై దాడి చేసిన వారికి పవన్ గెలుపుతో సమాధానం చెప్పినట్లు అయ్యింది.