సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది దశాబ్ధ కాలం నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ కోరికనే.. స్టార్ సెలబ్రిటీ కిడ్స్ కూడా వెండితెరపై బాలనటులుగా పరిచయమవుతూ.. ఆ తర్వాత కాలంలో హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఆగ్ర కథానాయకుల పిల్లలు ఎంతోమంది సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి తమ ప్రతిభను కనుబరుస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి కూడా ఒకరు. అవును పై ఫోటోలో పాము పట్టుకుని ఎంతో ధైర్యంగా చూస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఒక మల్టీ టాలెంటెడ్ నటి. అంతేకాకుండా.. ఈమె సీనియర్ స్టార్ హీరో కూతురు కావడం గమన్హారం. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫోటోలో పాము పట్టుకొని ధైర్యంగా చూస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? ఈమె ఇండస్ట్రీలో యాంకర్, నిర్మాత, సింగర్ ఇలా అన్ని కలగలిగిన ఒక మల్టీ టాలెంటెడ్ నటి. అంతేకాకుండా.. ఈమె సీనియర్ స్టార్ హీరో కూతురు కావడం గమన్హారం. అలాగే ఈమె ఇద్దరు సోదరులు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పటికే ఈమె ఎవరో కనిపెట్టే ఉంటారు. అయితే ఆమె మరెవరో కాదు.. ‘మంచు లక్ష్మి’. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే మంచు లక్ష్మి సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
అయితే మొదట మంచు లక్ష్మి కొన్ని ఇంగ్లీష్ సీరియల్స్, టీవీ షోలు చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ధీరుడు(2011) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి సినిమాలోనే నెగెటివ్ పాత్రలో అలరించిన మంచు లక్ష్మి చాలా అద్భుతంగా నటించింది. ఈ కావనే.. హీరోయిన్ గా దొంగలముఠా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట తదితర సినిమాల్లో నటించింది. అలాగే మరి కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఇదిలా ఉంటే.. తాజాగా మంచు లక్ష్మి వంశీ కృష్ణ మళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అగ్ని నక్షత్రం‘ నటిస్తుంది. ఇక సినిమాలో మోహన్ బాబు కూడా నటించనున్నారు. కాగా, ఇందులో మంచు లక్ష్మి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించింది. ఇక ఈ సినిమాకు మోహన్ బాబు, లక్ష్మి నిర్మతలుగా వ్యవహిరించారు. అలాగే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మంచు లక్ష్మి చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి