ప్రముఖ బుల్లితెర ప్రసార లో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ షోలో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి కంటెస్టెంట్స్ తమదైన స్కిట్లతో, కామెడీ టైమింగ్ తో ఎంతగానో అలరించేవారు. ఇలా జబర్దస్త్ కామెడీ షో నుంచి ప్రేక్షకులు కావాల్సిన వినోదాన్ని పంచడమే కాకుండా.. మరింత రెట్టింపు కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో.. ఈ జబర్దస్త్ షోను ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోగా చూపించింది. అంతేకాకుండా.. వీటిని గురు, శుక్ర, వారాల్లో టెలికాస్ట్ చేసేవారు. కానీ, ఇటీవలే ఈ ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో మరి ఉండదని దానిని తీసేస్తామని చివరి ఎపిసోడ్‌లో చెప్తూ అందరూ తెగ బాధపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ జబర్దస్త్ షో కొత్త ప్యాట్రన్ మరో ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
గత కొన్నేళ్లుగా టీవీలో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు ప్రేక్షకులను ఎంతగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే ఈషోలలో ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోను ఇక నుంచి తీస్తున్నామని చివరి ఎపిసోడ్‌లో చెప్తూ అందరూ తెగ బాధపడ్డారు. ఇన్నాళ్లుగా వస్తున్న షో ఒక్కసారిగా తీసేస్తున్నామని చెప్పడంతో.. ప్రేక్షకులు కూడా ఈ విషయంలో చాలా బాధపడ్డారు. కానీ, త్వరలోనే ఈ జబర్దస్త్ ను రెండు ఎపిసోడ్ లుగా చేసి శుక్ర, శని వారాల్లో టెలికాస్ట్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జబర్దస్త్ షో కొత్త ప్యాట్రన్ కూడా ఓమో రిలీజ్ చేశారు. కాగా, ఆ షోలో ఇప్పటివరకు చాలా టీమ్స్ ఉన్నా.. ఇప్పుడు మాత్రం అందర్నీ కలిపి ఆరు టీమ్స్ కింద చేశారు. ఇక మిగిలిన వారిని ఈ టీమ్స్ లోనే యాక్ట్ చేయనున్నారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ లో రాకెట్ రాఘవ, బులెట్ భాస్కర్, ఆటో రామ్ ప్రసాద్, ఇమ్మాన్యుయేల్, పటాస్ ప్రవీణ్ – కెవ్వు కార్తీక్, తాగుబోతు రమేష్ – పటాస్ నూకరాజుతో కలిపి ఇలా మొత్తం ఆరు టీమ్స్ చేశారు. దీనినే ‘సరదా శుక్రవారం, సరిపోదా శనివారం’ అంటూ రెండు ఎపిసోడ్స్ గా విడగొట్టారు.
అయితే ఈ షోలో ఒక రోజు మూడు టీమ్స్, ఇంకో రోజు మూడు టీమ్స్ పర్ఫార్మ్ చేయగా ఒక్కో టీమ్ కి 20 పాయింట్స్ కి వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ని బట్టి మార్కులు ఇస్తారు. ఇలా రెండు రోజులు మూడు టీమ్స్ కి 60 చొప్పున మార్కులు వేస్తారు. ఇక ఇందులో ఏ మూడు టీమ్స్ కి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు గెలిచినట్టు. ఇలా గెలిచిన వాళ్లకు ప్రైజ్ మనీ కంటెస్టెంట్స్ అంతా ముందే బెట్టింగ్ వేసుకొని అమౌంట్ అనుకుంటే ఆ అమౌంట్ ని ఇస్తారు. ఇకపోతే విన్నర్స్ అంటే శనివారం జడ్జీలు ఎవరున్నారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ జడ్జిలుగా కృష్ణ భగవాన్, కుష్బూ నటిస్తున్నారు. మరి, జబర్దస్త్ కొత్త ప్యాట్రన్ తో రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.