చంద్రిక రవి గుర్తుందా? అంత తొందరగా మర్చిపోయే అందం కాదులెండీ ఈ అమ్మడిది. పైగా ‘మా భావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీలో ఒకే పాటతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది చంద్రికా రవి. ఇక ఈ ముద్దుగుమ్మ గురించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చంద్రిక రవి అరుదైన ఫీట్. మరి ఈ బ్యూటీ సాధించిన రేర్ ఫీట్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రికా రవి.. ఆస్ట్రేలియాకు చెందిన ఈ బ్యూటీ ‘మా భావాలు దెబ్బతిన్నాయి’ అన్న ఒకే ఒక్క పాటతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. చంద్రికా రవి పడ్డ కష్టాన్ని, ఆమె స్ఫూర్తినిచ్చే జీవిత కథను తెలుసుకున్న Rukus Avenue Radio వ్యవస్థాపకుడు సమ్మీ చంద్‌కి అరుదైన అవకాశం కల్పించాడు. అమెరికన్ టాక్ షో ‘ది చంద్రికా టాక్ షో’ కు హోస్ట్ గా వ్యవహరించనుంది చంద్రికా. హోస్ట్ గానే కాకుండా ఈ షోకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. తన జీవిత విశేషాలను ఈ షో ద్వారా ప్రేక్షకులతో పంచుకోవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పింది.
యూఎస్‌లో అతిపెద్ద రేడియో నెట్ వర్క్ అయిన iHeart Radio..లో ఈ టాక్ షో ప్రసారం. ఈ షోకు సంబంధించిన ఎక్కువ పనులను చంద్రికనే దగ్గరుండి మరీ చూసుకుంటుంది. ఇన్నేళ్ల ప్రదర్శనలతో ప్రస్తుతం.. ఈ టాక్ షో నాకు ప్రత్యేకమైంది.. ఇక ముందు కొత్త చంద్రికను చూస్తారు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక టాక్ షో ద్వారా అరుదైన ఘనతను ఆమె సొంతం చేసుకుంది. యూఎస్‌లో రేడియో షో హోస్ట్ చేసిన తొలి భారతీయ మహిళగా చంద్రిక రవి రేర్ ఫీట్ ను ప్రారంభించింది. ఈ భారతీయ షో కాలమానం ప్రకారం ప్రతీ గురువారం ఉదయం 7:30 గం. ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ప్రేక్షకులకు చేరువ కావడానికి ప్రతీ శుక్రవారం ఎపిసోడ్స్‌ను యూట్యూబ్‌లో విడుదల చేయనున్నారు. మరి ఈ అరుదైన ఘనత సాధించి చంద్రిక రవిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.