తెలుగు సినిమాకి స్వాతంత్రం వచ్చింది. దాస్యపు సుంకాల సంకెళ్లని తెంపుకొని మరి స్వాతంత్య్రాన్ని పొందింది. దశాబ్దాల నుంచి కుల, మత, వర్గ బేధాలు లేకుండా ఎంతో మందిని ఆనందంలో ముంచెత్తుతున్న తెలుగు సినిమా సగర్వంగా స్వాతంత్య్రాన్ని పొందింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియాకి స్వాతంత్య్రం వచ్చిన తేదీ ఆగస్టు 14 అయితే తెలుగు సినిమాకి స్వాతంత్య్రం వచ్చిన తేదీ జూన్ 4 .
సినిమా.. ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని అమ్మ వంటిది. తల్లి ఎలా అయితే పురుటినొప్పులని భరించి బిడ్డకి జన్మనిస్తుందో. సినిమా కూడా అంతే. ప్రేక్షకుడి ఆనందం కోసం ఎన్ని కష్టాలు అయినా పడుతుంది. అలాంటి తల్లి లాంటి సినిమాని గత వైసిపి ప్రభుత్వం నామరూపాలు లేకుండా చెయ్యాలని చూసింది.సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించడం. అది కూడా టీ దొరకని రేట్ కి టికెట్ అమ్మాలని చెప్పడం. షోస్ తక్కువగా వెయ్యడం. సినిమా వాళ్ళని తన ఇంటికి రప్పించుకొని అవమానం చెయ్యడం. చులకనగా మాట్లాడుతూ తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూసింది.వాళ్ళ పైత్యం ఎంత వరకు వెళ్లిందంటే టికెట్స్ ని కూడా అమ్మాలని చూసారు. దీన్ని బట్టి సినిమాపై జగన్ అడ్డంకిని వైసీపీ వికృత చేష్టల స్థాయిని అర్ధం చేసుకోవచ్చు.
అభం శుభం తెలియని నా పై ఈ దారుణాలు ఏంటని ఇన్నాళ్లు కన్నీటిని దిగమింగుకున్న సినిమా సరైన సమయం కోసం ఎదురుచూసింది. ఇప్పుడు టైం రావడంతో తన సత్తాని తెలియచేసింది. మొన్న ఏ పి వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జగన్ కి మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగింది. ఎవరు ఊహించని విధంగా డిపాజిట్ కూడా రాలేదు, గత ఎన్నికల్లో 151 ఏంఎల్ఏ సీట్లు సాధించిన జగన్ ఈసారి కేవలం 10 సీట్లకే పరిమితమయ్యాడు. తెలుగు సినిమా జోలికి వెళ్తే మేము ఉపేక్షించం అని ప్రజలు తేల్చి చెప్పినట్టు అయ్యింది. అసలు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా సినిమా జోలికి పోలేదు. కుదిరితే సహాయం చేసారు గాని పెత్తనం చెయ్యాలని చూడలేదు. ఎందుకంటే సినిమా అనేది ఒక స్వతంత్ర ప్రతి పత్తి కలిగిన సంస్థ. కళామ తల్లి మీద గౌరవంతో కొన్ని కోట్ల రూపాయిల సొంత డబ్బుతో సినిమాని నిర్మించారు. దాని వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది కుటుంబాలు జీవనాన్ని గడుపుతారు.అదే విధంగా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలను సేవా భావంతో అందిస్తుంది. అది కూడా ఎలాంటి స్వార్ధం లేకుండా అచంచలమైన ప్రేమతో వస్తుంది.. అంతటి శక్తి ఉన్న సినిమా జోలికి వెళ్తే ఎవరైనా మట్టి కరవాల్సిందే.. సినిమా అనేది ఆరో పంచ భూతం..బీ కేర్ ఫుల్ పొలిటికల్ లీడర్స్