ప్రముఖ టీవీ నటితో క్రికెటర్ స్టార్ పెళ్లి జరగబోతోంది అన్న వార్త గత కొద్ది రోజులుగా నెట్టి వైరల్ గా మారింది. ఆ ప్లేయర్‌కు వరల్డ్‌కప్‌లో చోటు దక్కలేదని, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 9 సంవత్సరాలు ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ భారత స్టార్ ప్లేయర్ ఎవరు? ఆ టీవీ నటి ఎవరు? ఈ వార్తలపై ఆ నటి ఏమని స్పందించింది? పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఇటు ఇండస్ట్రీలో అటు క్రికెట్ వర్గాల్లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? ప్రముఖ టీవీ నటి రిద్ధిమా పండిట్ ను శుభ మన్ గిల్ పెళ్లాడబోతున్నాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరు వచ్చే డిసెంబర్ లో పెళ్లిపీటలెక్కబోతున్నారు అనే వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. రిద్దిమా ఏజ్ 33 కాగా.. గిల్ వయసు 24, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 9 సంవత్సరాలు. ఈ జోడీ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త ఎక్కడి నుంచి లీక్ అయ్యిందో తెలీదు కానీ గత కొన్ని రోజులుగా వైరల్ గా మారింది. దాంతో ఈ వార్తపై స్వయంగా స్పందించింది రిద్ధిమ.
“నేను మార్నింగ్ లేవగానే జర్నలిస్ట్ ల నుంచి నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫలానా క్రికెటర్ తో పెళ్లి జరగబోతోంది కదా? అంటూ ప్రశ్నించారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పా. పైగా ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఉంటే నేనే ముందుగా పేరు పెట్టాను. అంతే తప్ప ఇలాంటి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయకండి” అంటూ వివరణ ఇచ్చుకుంది. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై గిల్ రియాక్ట్ కాలేదు. కాగా.. గిల్, సచిన్ గారాల పట్టి సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నాడని గతంలో వార్తలు వైరల్ అయిన విషయం తెలియదు. కానీ ఈ విషయంపై ఇటు సారా గానీ అటు గిల్ గానీ ఎప్పుడూ నోరు విప్పలేదు. ఈ టీవీ నటితో పెళ్లి అంటూ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచాడు శుభ్ మన్ గిల్. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు గిల్.
రిధిమా పండిట్ శుభ్‌మాన్ గిల్‌తో వివాహం వార్తలపై స్పందించింది – https://t.co/5XCtpAJ4NV pic.twitter.com/EAZckrYfam
— ఇస్లామాబాద్ ఇన్సైడర్ (@IslooInsider) జూన్ 2, 2024
రిధిమా పండిట్ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో పెళ్లి పుకార్లను ఖండించారు: “అతని వ్యక్తిగతంగా కూడా తెలియదు” https://t.co/TGFpBLST2Z pic.twitter.com/dYHxMNOsnb
— Netamaker (@netamakerIndia) జూన్ 1, 2024