యంగ్ హీరో శర్వానంద్.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోల్లో ఈయన కూడా ఒకరు. ఇక శర్వానంద్ పేరు వినగానే మొదట యూత్ కట్టుకునే లవ్ మూవీస్, కుటుంబ కథా చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే.. శర్వానంద్ అటు యూత్ ను ఇటు ఫ్యామిలీని బాలెన్స్ చేసే ఎంటర్టైన్మెంట్ సినిమాల్లోనే ఎక్కువగా అలరించాడు. ఈ చూస్తున్న ఈయనకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా శర్వానంద్, హీరోయిన్ కృతి శెట్టితో కలిసి ‘మనమే’ అనే ప్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా రేపు అనగా శుక్రవారం జూన్ 7వ తేదిన థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీకి సంబంధించి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మూవీ మేకర్స్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర నిర్మాత శర్వానందకు తాజాగా ఓ బిరుదును ఇచ్చారు. ఇంతకి అదేమిటంటే..
తాజాగా యంగ్ హీరో శర్వానంద్, కృతిశెట్టి జంటగా ‘మనమే’ అనే సినిమాలో నటించారు. కాగా, ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. ఇకపోతే ఈ సినిమా ఈ శుక్రవారం అనగా జూన్ 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్రనే బృందం హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక ఈవెంట్ కు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్ దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఇంకా.. ఈ ఈవెంట్ లో చిత్ర నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ శర్వానంద్ కు ఓ బిరుదును ఇచ్చారు. ఇంతకి అదేమిటంటే.. ‘చామింగ్ స్టార్ శర్వానంద్’. ఇక శర్వానంద్ బిరుదును ఇవ్వడమే కాకుండా.. ఆయన సినీ కెరీర్ పై ప్రత్యేక వీడియోను ప్రదర్శించి మరి బిరుదును ప్రదర్శించారు.
ఇక ఈ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘తనకు ఈ బిరుదును అంకితం చేసిన నిర్మాతలకు, అలాగే తనని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకున్నారు. అలాగే ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనం ఉన్న సినిమాలనే కోరుకుంటా. అలాంటి కొత్తదనం ఈ సినిమాలో కూడా ఉంది. ముఖ్యంగా సమయం ఎంత విలువైందో ఈ సినిమాలో చూపించాం. కానీ, అలా అని సందేశం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇక సినిమా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. దీనితో పాటు సినిమాలో చివరి 40 నిమిషాలు మిమ్మల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది. అలాగే ఈ మూవీ తప్పక బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. పైగా ఈ ప్రాజెక్టును నేను ఎంతగానో ప్రేమించా. ఇకపోతే దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చాలా ప్రతిభావంతుడు. అయితే ఈ ఈవెంట్‌ను పిఠాపురంలో నిర్వహించాలనుకున్నాం. కానీ, అనుమతి లభించలేదు. ఇక సక్సెస్ పార్టీ మాత్రం అక్కడే ఉండొచ్చు’ అని అన్నారు. మరి, శర్వానంద్ కు చామింగ్ స్టార్ అనే బిరుదు ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.