ఎంత ఎత్తుకు ఎదిగినా వచ్చిన దారిని మర్చిపోకూడదు అని అంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు చుట్టూ మనతో పాటు ఎంతోమంది కష్టాలను చూసి ఉంటాం. కష్టపడేవారిని చూసి అయ్యో అని అనుకుని ఉంటాం. కాళ్ళు లేని వాళ్ళని చూసి ఏదైనా చేయాలి అని అనుకుంటాం. బాగా డబ్బు సంపాదించాక తల్లి లేని పిల్లలకు ఏమైనా చేయాలి అని అనుకుంటాం. అదృష్టవశాత్తు డబ్బు సంపాదించాక ఇవన్నీ గుర్తుంటే చేస్తాం. లేదంటే లైట్ తీసుకుంటాం. కానీ కొంతమంది అలా ఉండలేరు. సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా కూడా సమాజానికి ఏదో రకంగా సాయం చేయాలని చూస్తారు. చాలా మంది పుట్టినరోజు వేడుకల పేరుతో పార్టీలు, కేక్ కటింగులు, మందు పార్టీలు, భారీగా జనాన్ని పిలిచి బోలెడంత డబ్బు ఖర్చు చేస్తారు. కానీ కొంతమంది మాత్రం చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.
హీరోయిన్ దర్శ గుప్త తన పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. అనుకున్నట్టే ఆమె తన పుట్టినరోజుని మధుర జ్ఞాపకంగా మలచుకున్నారు. చాలా మంది ఓ పెద్ద ఎత్తున భారీ కేకులు కట్ చేసి.. హడావుడి చేసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది మాత్రం అనాథ శరణాలయాల్లో.. వృద్ధాశ్రమాల్లో అనాథ పిల్లలు, వృద్ధులతో కలిసి జరుపుకుంటారు. వారి సమక్షంలో కేక్ కట్ చేసి వారికి ఎంతో కొంత సహాయం చేస్తారు. అలాంటి వారిలో హీరోయిన్ దర్శ గుప్త ఒకరు. ఆమె తన బర్త్ డే వేడుకలను చాలా సింపుల్ గా జరుపుకున్నారు. మామూలుగా సెలబ్రిటీలు అంటే ఖచ్చితంగా భారీ పార్టీ, తోటి సెలబ్రిటీలను ఆహ్వానించడం లాంటివి ఉంటాయి.
కానీ ఈ హీరోయిన్ మాత్రం అలాంటి వాటికి చోటివ్వకుండా తన పుట్టినరోజు వేడుకలను సింపుల్ గా అనాథాశ్రమంలో జరుపుకున్నారు. అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. వారితో చాలాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఈ తల్లి లేని పిల్లలకు అందరూ తల్లులే. ఇవాళ నా పుట్టినరోజుని దేవుని బిడ్డలతో జరుపుకుంటున్నాను. వీళ్ళని ఆదుకునేందుకు చేతులు కలపండి’ అంటూ శ్రీ అరుణోదయం.ఓఆర్జీ ఛారిటీ ఆర్గనైజేషన్ గురించి ఆమె చెప్పారు. ఈ పుట్టినరోజున ఆమె చీరకట్టుకుని సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు దగ్గరుండి భోజనం వడ్డించారు.
ఆఖరున వారితో కలిసి ఒక ఫోటో తీయించుకున్నారు. అయితే ఆమెకు ఇలా సేవా కార్యక్రమాలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాలలో ఆమె సేవా కార్యక్రమాల్లో ఉండేది. రీసెంట్ గా రోడ్డు పక్కనే ఉన్న వృద్ధులకు అన్నం పొట్లాలు, మంచి నీళ్ల బాటిల్స్ అందించారు. దర్శ గుప్త రుద్ర తాండవం, ఓ మై ఘోస్ట్ అనే తమిళ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఈమె పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆమె చేసిన పనికి మెచ్చుకుంటున్నారు.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి