హీరోయిన్ ‘జెనీలియా’.. ఈపేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇక జెనీలియా పేరు వినగానే హ..హ.. హాసిని అంటూ మనకు ముందుగా బొమ్మరిల్లు సినిమానే గుర్తుకు వస్తుంది. అంతలా ఆ సినిమాలో చాలా అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించింది జెనిలియా. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా.. సత్యం, హ్యాపీ, ఢీ, సాయి, శశిరేఖపరిణయం, సై, రెడీ, ఆరెంజ్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ బ్యూటీ. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మడు చేసిన తక్కువ సినిమాలే అయిన స్టార్ హీరోయిన్ రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. లేకపోతే 2012లో నా ఇష్టం మూవీ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కనుమరుగైంది జెనిలియా. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ‘తుజే మేరి కసమ్’ అనే సినిమాతో జెనీలియా ఎంట్రీ ఇచ్చింది. ఇక అదే సినిమాలో రితేష్ దేశ్ ముఖ్ కూడా నటించారు. ఆ సమయంలో ఆ ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా ఏర్పాడింది.
ఈ కోరికనే రితేష్, జెనీలియా 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ప్రస్తుతానికి వీరిద్దరికి రాహైల్, రియాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలా ఉంటే.. రితిష్ దేశ్ ముఖ్ ను పెళ్లిచేసుకున్న జెనీలియా పూర్తిగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. కాగా, అక్కడకి కొన్నేళ్లు భర్త ప్రోత్సాహంతో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. ఆ తర్వాత సినిమాలో పూర్తి పాత్రలు చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ కోరికనే తన భర్తతో హిందీలో మిస్టర్ మమ్మీ, మరాఠిలో వేడ్ అనే సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జెనీలియా తెలుగులో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జెనీలియా కూడా తనకి తెలుగులో మంచి పాత్రలు దొరికితే నటించడానికి రెడీ అని తాజాగా స్టేట్ మెంట్ ఇచ్చింది. కానీ, మళ్లీ తాను తెలుగులో హీరోయిన్ గా చేస్తుందా ప్రత్యేకమైన పాత్రల్లో చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
అయితే నిజానికి జెనీలియాకు ఇద్దరు పిల్లలు ఉన్నా ఇప్పటికి అదే తరగని అందంతో అందర్నీ ఆకట్టుకుంటుంది. మరొపక్క జెనీలియా కంటే సీనియర్లయిన త్రిష, నయనతార ఇప్పటికి హీరోయిన్లుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. మరి, వారిలో నయన్ కూడా ఇద్దరు పిల్లల తల్లి అనే విషయం తెలిసిందే. ఇక అలాంటప్పుడు ఇప్పటికీ అందంగానే ఉన్నా జెనీలియా హీరోయిన్‌గా ఎందుకు చేయకూడదని ఆమె అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి, తెలుగులో అల్లరి పిల్ల హాసినిగా ముద్ర వేసుకున్న జెనీలియా టాలీవుడ్ ఎంట్రీ ఎలా ఇస్తుందో చూడాల్సిందే. మరి, త్వరలో జెనీలియా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.