‘కామాక్షి భాస్కర్ల’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. విడుదలైన సమయంలో ఓటీటీ వేదికగాైన పొలిమేర సినిమాతో ఈ నటి బాగా ఫేమస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో కామక్షి డీ గ్లామర్ పాత్రలో, తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది . అయతే అచ్చ తెలుగమ్మాయి అయిన కామాక్షి మొదటిగా ‘ప్రియురాలు’ అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఆ సినిమాలో తన నటన చూసిన ఆడియోన్స్ ఫిదా అయ్యారనే చెప్పవచ్చు. ఇక అంతలా ఆ సినిమాలో తన అందం, అద్భుతమైన నటనతో అలరించిన కామాక్షికి ఆ తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ కోరికనే.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, మా ఊరి పొలిమేర, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, పొలిమేర 2, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాలలో నటించారు.
ఇక వీటితో పాటు ఝాన్సీ, సైతాన్, దూత వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. కానీ, వీటన్నిటి కన్నా కామాక్షి కి ‘పొలిమేర’ మూవీతోనే ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ఇండస్ట్రీలో బోల్డ్ పాత్రల్లో నటిస్తే.. బయట కూడా అలానే ఉంటారని అనుకోకండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకి ఏం జరిగిందంటే.. పొలిమేర సినిమాలో డీ గ్లామర్ పాత్రలో, తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన కామాక్షి ఆ తర్వాత చేసిన చిత్రాలలో చాలా వరకు బోల్డ్ పాత్రలను పోషించిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి మాట్లాడుతూ.. ‘బోల్డ్’ కంటెంట్‌లో నటించడానికి కారణం కామాక్షి.. అసలు సినిమాల్లో బోల్డ్‌గా నటిస్తే బయట కూడా అలాగే ఉంటారేమో అని తప్పుగా ఆలోచిస్తున్నారని చెప్పారు. ఇక మొదట్లో సాఫ్ట్ పాత్రలో నటించి ఆ తర్వాత బోల్డ్ పాత్రలు చేస్తే మెచ్చుకుంటారు. అదే మొదటి నుంచి బోల్డ్ పాత్రల్లో నటిస్తే మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటారని కామాక్షి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇంకా తమ మైండ్ సెట్ మార్చుకోవాలని, యాక్టర్లను యాక్టర్లను చూడాలని కామాక్షి.ఇక లీడ్ క్యారెక్టర్ అనగానే ముంబై, ఢిల్లీకి ఫోన్ చేస్తారని’ చెప్పుకొచ్చింది.
‘అలాగే తెలుగుమ్మాయిలకు ఇండస్ట్రీలో న్యాయం జరగడం లేదు. ఎందుకంటే.. ఇక్కడ తెలుగమ్మాయిలు నటించడానికి వచ్చినా వాళ్లను సైడ్ క్యారెక్టర్లకే పరిమితం చేయలేదు. దీంతో వాళ్లు చాలా కష్టపడుతున్నారు, సినిమాల్లో ఆ కష్టం కనిపిస్తుంది. పైగా ఎలాంటి క్యారెక్టర్లు అయినా చేస్తాం అంటున్నా అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదని చెప్పుకొచ్చింది. ఇక తన ప్రొఫైల్ చూసిన కొందరు గ్లామర్‌గా లేదంటూ కామెంట్స్ చేశారు, దానితో పాటు పర్ఫార్మ్ చేస్తున్నా కూడా గ్లామర్ గురించే మాట్లాడలేదు. అయితే ఇక్కడ యాక్టింగ్ చేయకపోతే చేయలేదని, చేస్తున్నప్పుడు ఇలా మాట్లాడడం ఏంటని కామాక్షి ప్రశ్నించింది. కానీ తాను ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేశానని, ఇది ఒక్క రోజులో మారే విషయం కాదంటూ’ కామాక్షి చెప్పుకొచ్చింది. మరి ప్రస్తుతం కామాక్షి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.