తెలుగు ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా నటుడు, నిర్మాతగా తన సత్తా చాటుతున్నాడు నాని. ఇండస్ట్రీలో హీరోలు ఎన్ని సినిమాలు నటించినా అందులో ఫీల్ గుడ్ మూవీ ఒకటి ఉంటుంది.. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘భీమిలి కబడ్డీ జట్టు’ . ఈ సినిమాలో నాని ఎంతో నేచురల్ గా నటించాడు. తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు 2010లో విడుదలైంది.. కథ పరంగా చాలా అద్భుతంగా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన వెన్నిళ కబడి కుళు కి రిమేక్. ఈ మూవీలో నాని సరసన నటించిన హీరోయిన్ ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. వివరాల్లోకి వెళితే..
నాని హీరోగా నటించిన ‘భీమిలి కబడ్డి జట్టు’ మూవీలో హీరోయిన్ గా శరణ్య మోహన్ నటించింది.సినిమాలో ఈ జంట ముచ్చటగా కనిపిస్తుంది. శరణ్య మోహన్ తమిళ్, మలయాళల చిత్రాల్లో ఎక్కువగా నటించారు. కన్నడ, హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.తెలుగులో కృష్ణుడు హీరోగా నటించిన విలేజ్ లో వినాయకుడు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత భీమిలి కబడ్డి జట్టు, హ్యాపీ హ్యాపీ, కళ్యాణ్ రామ్ కత్తి మూవీలో నటించింది. శరణ్య చాలా క్యూట్ గా అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది. ఎక్కువగా ట్రెడిషినల్ లుక్ లో కనిపించే శరణ్య కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరమైంది.
హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు, డాక్టర్ అయిన అరవింద్ కృష్ణన్ ని 2015లో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. వివాహం తర్వాత ఒకటీ రెండు సినిమాల్లో నటించినప్పటికీ కుటుంబం కోసం ఇండస్ట్రీకి దూరమైంది. కానీ అడపాదడపా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు అభిమానులకు షేర్ చేసింది. ఒకప్పుడు సినిమాల్లో శరణ్య ఎంతో క్యూట్ గా కనిపించింది.. ఇప్పుడు కాస్త మారింది. తాజాగా శరణ్యకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో అమ్మడు క్యూట్ లుక్ తో మోడ్రన్ డ్రెస్ లో కనిపిస్తుంది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి