ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన వివిధ కారణాల వల్ల ఆసుపత్రిలో చేరడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొంతమంది నటినటులు క్యాన్సర్ భారిన పడి ధైర్యంతో పోరాడి మళ్లీ కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నారు.మరికొంతమంది డెంగ్యూ ఇతర అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రుల్లో చేరుతున్నారు. టెలివిజన్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న షో బిగ్ బాస్. బాలీవుడ్ లో మొదలైన బిగ్ బాస్ ఇప్పుడు ఇతర భాషల్లో కూడా దుమ్మురేపుతుంది. బిగ్ బాస్ తో పాపులర్ అయి బుల్లితెర, వెండితెరపై నటినటులుగా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా బుల్లితెర నటి, బిబ్ బాస్ కాంటెస్టెంట్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ రియాల్టీ షోగా బిగ్ బాస్ తో ఇప్పటి వరకు దేశంలో ఎంతోమంది కంటెస్టెంట్స్ తర్వాత కాలంలో నటీనటులుగా ఇండస్ట్రీలో తమ సత్తా చాటారు. కన్నడ భాషలో వస్తున్న బిగ్ బాస్ సీజన్ – 10 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి నమ్రత గౌడ. తాజాగా నమ్రత గౌడ ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రస్తుతం నమ్రత డెంగ్యూతో బాధపడుతున్న కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇది చూసి అభిమానులు నమ్రత గౌడ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
నమ్రత గౌడ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘నేను ఇప్పుడప్పుడే కోలుకుంటున్నా.. నా ఆరోగ్యంగా ఇప్పుడు బాగుంది. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చింది. నమ్రత ఆసుపత్రి బెడ్ పై పడుకొని ఉండగా.. తన తల్లి ఆహారం తినిపిస్తున్న ఫోటో ఒకటి షేర్ చేసింది. కన్నడ టెలివిజ్ లో 2011లో ‘కృష్ణ రుక్మిణి’ అనే సీరియల్ తో ఆమె కెరీర్ ప్రారంభించింది. ఇక నమ్రత గౌడ కెరీర్ విషయానికి వస్తే.. కన్నడ టీవీలో ‘నాగిని’ సీరియల్ లో శివాని పాత్ర పోషించినందుకు ఆమెకు కన్నడ నాట ఎంతో గుర్తింపు వచ్చింది.