భారతీయ సినీ పరిశ్రమలో ,భారతీయ టెలివిజన్ పరిశ్రమలో, భారతీయ పత్రికారంగంలో, భారతీయ వ్యాపార రంగంలో, పెను విషాదం పట్టుకుంది. కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగుని, స్థిరత్వాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపిన ఆలు పెరగని పోరాటయోధుడు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత శ్రీ రామోజీరావు (రామోజీ రావు)గారు స్వర్గలస్థులయ్యారు.
కొన్ని రోజుల నుంచి ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.దీంతో కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం హాస్పిటల్ లో జాయిన్ చేసారు. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించే స్థాయికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.చివరకి విషమించడంతో ఈ రోజు తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. భౌతిక దేహాన్ని ఫిలిం సిటీ లోని ఆయన స్వగృహానికి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపనుంది. ఒక మీడియా దిగ్గజానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి. వివిధ సినీ ప్రముఖులు సినీ రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఆయన మృతికి సంతాపాన్ని తెలియచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చే పెదపారుపడి ఆయన జన్మస్థలం.