బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో బాలీవుడ్ క్విన్, బీజేపీ నేత కంగనా రౌనత్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఎంతో విజయోత్సాహంతో ఉన్న కంగనకు దారుణమైన అవమానం జరిగింది. చందగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్.. కంగనా చెంప చెళ్లుమనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పెను సంచలనం అయ్యింది. అయితే కుల్విందర్ కౌర్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా, సాగు చట్టాలను వ్యతిరేకించిన రైతులపై గతంలో కంగన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చేయిట్లు కుల్విందర్ కౌర్ కలిగి ఉంది.
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా కుల్విందర్ కౌర్ కి మద్దతు పెరుగుతుంది. ఇందులో కొంతమంది సినీ సెలబ్రెటీలు కూడా ఉన్నారు. తాజాగా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌కి గాయకుడు విశాల్ దద్లానీ మద్దతుగా నిలిచారు. తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో స్పందిస్తూ.. ‘ఆమెపై ఏదైనా చర్యలు తీసుకుంటే.. తనకు మంచి ఉద్యోగ అవకాశం కల్పిస్తానని.. నేను హింసను సమర్థించాను కానీ.. మహిళా కానిస్టేబుల్ కోపాన్ని అర్థం చేసుకున్నాను. ఒకవేళ ఆ అమ్మాయిపై ఏ చర్యలు తీసుకున్నా ఉద్యోగం పోయినా.. జాబ్ ఇవ్వడానికి నేను రెడీ. జై హింద్.. జై జవాన్.. జై కిసాన్ ‘ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే.. కుల్విందర్ కౌర్ కు పలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. రైతుల కష్టాల గురించి దర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే ఇష్టానుసారంగా మాట్లాడిన కంగనపై తన కోపాన్ని వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా ఆమెకు కంగనకు ఎలాంటి శత్రుత్వం లేదని అంటున్నారు. ఈ ఘటనపై సరైన విచారణ జరిపించాలంటూ పంజాబ్ డీజీపీని కలిసి కోరుతామని రైతు సంఘాల నేతలు సర్వణ్ సింగ్ సందేర్, జగ్దిత్ సింగ్ దల్లేవాల్ మీడియాకు తెలిపారు. ఈ డిమాండ్ తోనే ఆదివారం మొహాలిలోని ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తామని.