శ్రీలీల.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇది ఒక మాట. పెళ్లి సందడితో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత మాస్ మహారాజా నటించిన ‘ధమాకా’ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు పట్టేసింది. అరడజనుకు సినిమాలు ఒకేసారి ఒప్పుకుని టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమా వేగం తగ్గించింది. శ్రీలీల చేతిలో తెలుగు వరకు అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక్కటే చూపిస్తుంది. ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓ స్టార్ హీరో కొడుకు మూవీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందట. ఆ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల తన మకాన్ని మారుస్తున్నట్లు చూపుతోంది. తెలుగు ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ అమ్మడు.. మిగత పరిశ్రమల నుంచి ఆఫర్లు దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలో సెలెక్ట్ అయినట్లు టాక్. ఈ న్యూస్ పాతబడక ముందే మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే? శ్రీలీల బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ ప్రస్తుతం ‘దిలర్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా శ్రీలీలను అనుకుంటున్నారట. ఇదే జరిగి, సినిమా హిట్ అయితే.. బాలీవుడ్ లో శ్రీలీల హవా కొనసాగడం ఖాయం అంటున్నారు సినీ పండితులు.
ఇదిలా ఉండగా.. లేటెస్ట్ గా హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ యాడ్ షూట్ లో నటించింది శ్రీలీల. అందుకు సంబంధించిన పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా.. పాత తరం హీరోయిన్ లా అందంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక సినిమాలు తగ్గించడానికి ఆమె చదువు కూడా ఓ కారణంగా ఉంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసే పనిలో పడిందట. అందుకే మూవీలను కాస్త ఆలస్యంగా సెలెక్ట్ చేసుకుంటోందని సన్నిహితులు చెబుతున్నారు. మరి స్టార్ హీరో కొడుకు మూవీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ప్రత్యేకమైనవి: #శ్రీలీల బాలీవుడ్ తొలి చిత్రం ✍️
– తెలుగు నటి “శ్రీలీల” ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతోంది. ✔️
-“#సైఫ్ అలీఖాన్“కొడుకు”#ఇబ్రహీం అలీఖాన్”ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.🎬
– ఈ చిత్రం ప్రేమకథా కథాంశంగా ఉంటుంది
– ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచో ప్రారంభం అవుతుంది… pic.twitter.com/E2rTUS5arD— సినిమా తమిళం (@MovieTamil4) జూన్ 8, 2024