డైరెక్టర్ శంకర్.. వ్యవస్థలో దాగున్న లోపాలను పూస గుచ్చినట్లుగా తన సినిమాల్లో చూపిస్తూ.. ప్రేక్షకులను ఆలోచింప జేస్తుంటాడు. జెంటిల్ మెన్ నుంచి ఇప్పటి ఇండియన్ 2 వరకు ఇదే పంథాను శంకర్ అవలంభిస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ గా ఉన్నాడు శంకర్. కమల్ హాసన్ తో చేస్తున్న ‘ఇండియన్ 2’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా.. ఇండియన్ 2 మూవీపై ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ బాటలోనే శంకర్ పయనిస్తున్నారని సమాచారం.
‘విక్రమ్’ మూవీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ వాడిన స్ట్రాటజీనే ఇప్పుడు ఇండియన్ 2 కోసం శంకర్ వాడబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే? విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ పాత్ర ఇంటర్వెల్ ముందు నుంచి ఎలివేట్ అవుతూ వచ్చి.. సెకండాఫ్ మెత్తం కమల్ తన విశ్వరూపం చూపిస్తాడు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఇండియన్ 2లో శంకర్ వాడుతున్నాడట. ఈ మూవీలో కమల్ ఇంటర్వెల్ తర్వాత నుంచే వస్తాడని సూచిస్తుంది. అయితే విక్రమ్ మూవీలో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి తమ యాక్టింగ్ తో ఆడియన్స్ కు కమల్ లేకున్నా.. ఎక్కడా బోర్ కొట్టకుండా చూశారు.
మరి ఇండియన్ 2లో అలాంటి క్యారెక్టర్లు ఉన్నాయా? ఉన్నా వర్కౌట్ అవుతాయా? అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఈ విషయం బయటకి పొక్కడంతో.. ఫ్యాన్స్ రకరకాలుగా చెబుతున్నారు. కమల్ ఎంట్రీ ఇంటర్వెల్ నుంచి కాకుండా ముందే ఉంటే బాగుంటుందని వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే డైరెక్టర్ శంకర్ ఏదో మ్యాజిక్ చేసే ఉంటాడులే అని మరికొందరు చెప్తున్నారు. ఇక ఇండియన్ 2 జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి భారతీయుడు లాగా ఈ చిత్రం ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి. ఇక లోకేశ్ బాటలో పయనిస్తున్న శంకర్ స్ట్రాటజీ ఏ మేరకు ఫలిస్తుందో చూద్దాం.