తమిళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది తమదైన కామెడీ మార్క్ తో కడుపుబ్బా నవ్వించారు. తమిళ టాప్ కమెడియన్లు వడివేలు, దివంగత నటుడు వివేక్, సంతానం ఇప్పుడు యోగి బాబు. చిన్నా..పెద్ద ఏ హీరో సినిమా అయినా సరే ఈ కమెడియన్లు తప్పకుండా ఉండాల్సిందే. ఒకప్పుడు వడివేలు హీరో రేంజ్ లో రెమ్యమూనరేషన్ తీసుకునేవారని టాక్. వివేక్, సంతానం చాలా కూల్ గా కనిపిస్తూ తమదైన కామెడీ పంచ్ డైలాగ్స్ తో ధియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో స్టార్ కమెడియన్ గా యోగి బాబు వరుస సినిమాలతో ప్రస్తుతం ఉన్నారు. తాజాగా కమెడియన్ యోగిబాబు కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంది టాప్ కమెడియన్లు ఉన్నారు. అలాంటి వారితో పోటీ పడి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యోగిబాబు. కెరీర్ బిగినింగ్‌లో ఎన్నో అవమానాలు.. ఛీత్కారాలు ఎదుర్కొన్న యోగిబాబు పట్టు వదలకుండా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు. గుబురు జుట్టు.. నవ్వు పుట్టించే ఆకారం యోగి బాబు కి ఒకప్పుడు మైనస్ అయినా.. ఇప్పుడు అవే ప్లస్ గా మారాయి. ప్రస్తుతం కమెడియన్ గానే కాదు హీరోగా కూడా తన సత్తా చాటుతున్నాడు. తాను హీరోగా నటించిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చినా.. కమెడియన్ గానే కొనసాగుతున్నాడు. యెగి బాబు ఈ స్థాయికి రావడానికి ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు అని పలు ఇంటర్వ్యూలో చెప్పారు.
యోగి బాబు ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డా.. పట్టు వదలకుండా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. తన కుటుంబం సంతోషంగా.. ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన నిరంతరం శ్రమించాడు. 2020లో భార్గవిని పెళ్లి చేసుకున్నాడు.. ఈ జంటకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తాజాగా యోగి బాబు ఇంట ఓ సంఘటన చోటు చేసుకుంది. యోగిబాబు తమ్ముడు విజయన్ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మైసూర్ కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో విజయన్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. విజయన్ ప్రేమ వ్యవహారం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తమ్ముడి ప్రేమను అర్థం చేసుకున్న యోగి బాబు మహిళ కుటుంబ సభ్యుల వద్దకు స్వయంగా వెళ్లి వారిని ఒప్పించాడు. జూన్ 3 న యోగి బాబు స్వగ్రామం సెయ్యర్ లో తన తమ్ముడు కోరుకున్న అమ్మాయితో సింపుల్ గా రహస్యంగా వివాహం జరిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.