నిత్యం ఎన్నో రకాల వార్తలు వస్తుంటాయి. అయితే సినీ, రాజకీయ రంగానికి చెందిన వార్తలే సెన్సేషన్ గా మారుతుంటాయి. అందులోనూ సినిమా వాళ్లకు సంబంధించిన వార్తలను చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలానే సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు షేర్ చేస్తున్నారు. అయితే అలా చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ముఖ్యంగా హీరోయిన్లు తల్లులుగా మారిన తరువాత..వారి బిడ్డలతో చేసే వీడియోలు ఆకట్టుకుంటాయి. అలానే తాజాగా గోవా బ్యూటీ ఇలియానా కొడుకు ఒక్కసారిగా సెన్సేషన్ మారిపోయాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గోవా బ్యూటీ ఇలియానా సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు వారికి అస్సలు అవసరం లేదు. రామ్ హీరోగా నటించిన దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఈ గోవా బ్యూటీ. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. అయితే పోకిరి సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించింది. మరో యువతకు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. మహేష్ బాబు పోకిరి సినిమాతో ఇలియానా టాలీవుడ్ ఇండస్ట్రీలో సునామి సృష్టించింది. దాదాపు అందరు టాలీవుడ్ స్టార్ హీరోలతో ఈ అమ్మడు నటించింది.
ఇక ఈ బ్యూటీ తన అందాల ఆరబోతతో చాలా కాలం పాటు ఇండస్ట్రీని ఊపేసింది. ఇంకా ఇలియానా కోసం వెళ్లే ప్రేక్షకులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇక్కడ వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ కి వెళ్లిన తరువాత టాలీవుడ్ ను పట్టించుకోలేదు. అలానే అదనంగా లవ్ ఎఫైర్ నడిపిందని టాక్ వినిపించింది. వాటి కారణంగా ఎదురైన సమస్యలతో ఇలియానా సతమతమయిందని, అదనంగా డిప్రెషన్ లోకి కూడా వెళ్లింది. ఆ తరువాత తిరిగి కోలుకుని ఫారెన్ వ్యక్తిని ఇలియానా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. తాను గర్భవతిని అని ప్రకటించే వరకు ఇలియానా పెళ్లి చేసుకుంటుందా అనే విషయం కూడా ఎవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు.
పండంటి మగబిడ్డకు ఈ బ్యూటీ జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇలియానా తన భర్త, బిడ్డతో సంతోషంగా గడుపుతోంది. తన కుమారుడికి కోవా ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టింది ఇలియానా. ఇక అదనంగా తరచు తన బిడ్డకు సంబంధించిన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈసారి ఏకంగా వీడియోనే షేర్ చేసింది. ఈ వీడియోలో ఇలియానా కొడుకు పాలబుగ్గలతో ముద్దొచ్చే విధంగా ఉన్నాడు. అల్లరి చేస్తూ నీటిలో జలకాలాడుతూ ఉన్నాడు. సెలబ్రిటీలు సైతం ఈ బుడ్డోది క్యూట్ నెస్ కి ఫిదా అవుతున్నారు. ఈ వీడియోతో ఈ గోవా బ్యూటీ కొడుకు నెత్తింట్లో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయాడని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.