సినీ ప్రపంచంలో సెలబ్రిటీస్ గా కొనసాగాలని చాలామంది కలలు కంటారు. ఇక ఆ కలలను సాకారం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది వెండితెర పై తమని తాము చూసుకునేందుకు అష్ట కష్టాలు కూడా పడతారు. అయితే కొందరు మాత్రం మంచి ఉన్నతమైన వృత్తి, నచ్చిన ఫ్రొపెషన్ లో కొనసాగుతూనే ఉన్నారు.. సినిమా మీద పిచ్చితో వాటిని వదులుకొని మరి వెండితెరపై ఎంట్రీ ఇస్తారు. ఇప్పటికే ఇలా మంచి ఉద్యోగం చేస్తున్న వారు సైతం సినీ ఇండస్ట్రీ పై ఆసక్తితో వాటిని విడిచిపెట్టి సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరో కూడా. అవును.. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయాడు. అంతేకాకుండా.. ఈ హీరో నటనకు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి కూడా అభిమాని అయ్యాడు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు ఎవరో కనిపెట్టారా.. ఈయన ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరో. ఇటీవలే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న ఓ సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. ఇక ఈ యంగ్ హీరో నటనకు టాలీవుడ్ జక్కన సైతం అతనికి అభిమాని అయిపోయాడు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఆయన మరెవరో కాదు.. కేరళ అబ్బాయి ‘శ్యామ్ మోహన్’. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే కానీ ‘ప్రేమలు’ మూవీ సెకండ్ హీరో అంటే ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. ప్రస్తుతం ఆయన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఫోటో చూసిన నెటిజన్స్ చిన్నప్పుడు కూడా శ్యామ్ చాలా అందంగా ఉన్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. శ్యామ్ మెహన్ .. తొమ్మిదేళ్ల క్రితం ఓ యువకుడు ముంబైలోని సిటీ బ్యాంక్‌లో మంచి ఉద్యోగాన్ని వదులుకున్నాడు. నటనపై ఆసక్తి, అంతకు మించి కొత్తగా ఆలోచనలతో ఏదైనా చేయాలనుకున్న అతడి పట్టుదల. సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం. దీంతో షార్ట్ ఫిల్మ్స్‌లో నటించడం ప్రారంభించాడు.
ఈ కోరికనే..మొదట యూట్యూబ్ వెబ్ సిరీస్ ‘పొన్ముట్ట’ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. అలాగే అతడు నటించిన మరొ షార్ట్ ఫిల్మ్ నైట్ కాల్ మంచి రెస్పాన్స్ వచ్చింది.ఆ తర్వాత అతనికి ’18 ప్లస్’ సినిమాలో అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ యంగ్ హీరో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత.. ‘ప్రేమలు’ సినిమాలో ఆది పాత్రలో నటించాడు శ్యామ్. కాగా, ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో భారీ విజయాన్ని ఈ ఇటు తెలుగులోనూ విడుదల చేయగా సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా.. ఈ ఆది పాత్రలో అలరించిన శ్యామ్ మోహన్ తన ఫేవరేట్ నటుడు అని, తన నటన, అల్లరి, రైటింగ్ తనకు చాలా బాగా నచ్చాయని డైరెక్టర్ రాజమౌళి గతంలో చేసిన వ్యాఖ్యలు. లేకపోతే ప్రస్తుతం శ్యామ్ మోహన్ శివకార్తికేయన్ నటిస్తున్న కొత్త తమిళ చిత్రంలో సాయి పల్లవికి సోదరుడిగా నటిస్తున్నాడు. అలాగే గోవింద్ గెట్ సెట్ బేబీ చిత్రంలో నటిస్తున్నాడు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రేమలు నటుడు శ్యామ్ మోహన్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.