సోషల్ మీడియా పుణ్యమా అని సినీ సెలబ్రెటీలు తమ అభిమానులకు మరింత దగ్గరవుతున్నాయి. ఒకప్పుడు పేపర్లు, టీవీల్లో తమకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియాల్లో తమకు సంబంధించిన ప్రతి ఒక్క వివరాలను అభిమానులకు షేర్ చేస్తున్నారు. తమ చిన్ననాటి ఫోటోలు, ఫ్యామిలీ పిక్స్, వెకేషన్ టూర్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఫ్యాన్స్ కి షేర్ చేస్తున్నారు. వాటిని అభిమానులు లైక్స్, షేర్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలకి సంబంధించిన నటీనటుల వారసులు ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ కపుల్స్ కూతురు చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్‌మాన్ పేరు తెచ్చుకున్న నటుడు రాజశేఖర్. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించి తర్వాత హీరోగా మారారు. తనతో పాటు పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి జీవితాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భారతీ రాజా దర్శకత్వంలో 1984లో ‘పుధుమై పెన్’ మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తెలుగులో ‘వందేమాతరం’ చిత్రంతో పరిచయం అయ్యారు. చాలా వరకు తెలుగు చిత్రాల్లోనే నటించారు. జీవిత-రాజశేఖర్ కి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పేరు శివాని, చిన్న కుమార్తె శివాత్మిక. ప్రస్తుతం ఇద్దరూ సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
పైన కనిపిస్తున్న చిన్నారిని చూశారా? ఎంత క్యూట్‌గా స్మైల్ ఇస్తుంది..! ఈ ముద్దుల పాప ఎవరో కాదు.. జీవిత-రాజశేఖర్ దంపతుల చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో నటించాలంటే ఇష్టంతో మహేంద్ర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘దొరసాని’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో రెండు చిత్రాల్లో నటించింది. ఇటీవల పంచ తంత్రం, రంగమార్తాండ మూవీలో నటించింది. ‘దొరసాని’ మూవీలో నటించినందుకు గాను SIIMA అవార్డు అందుకుంది. ప్రస్తుతం శివాత్మిక చైల్డ్ హుడ్ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.