ప్రముఖ నటి నూర్ మాళవికా దాస్ (32) అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్న ఆమె.. తన ఫ్లాట్‌లోనే ఫ్యాన్‌కి ఉరి వేసుకొని మరణించింది. నూర్ చనిపోతే కనీసం పట్టించుకున్న వారు కూడా లేరు. ఆ ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుంది.. పోలీసులకు సమాచారం అందించారు. కుళ్ళిన స్థితిలో ఉన్న ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నూర్ ని చూడటానికి ఆమె కుటుంబ సభ్యులు రాకపోవడం పలు అనుమానాలను దారి తీస్తోంది.
అసోంకు చెందిన మాళవికా ఎయిర్‌స్టెస్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటనపై ఇష్టంతో సినీ పరిశ్రమకు వచ్చి.. పలు సినిమాలు, సిరీస్‌లలో నటించింది. ‘ది ట్రయల్’ అనే వెబ్ సిరీస్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా ఎదుగుతున్న సమయంలో.. చిన్న వయసులోనే ఆమె మరణించడం షాకింగ్ గా మారింది.