హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సమీరారెడ్డి (సమీరా రెడ్డి). తెలుగులో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. 2014 లో పెళ్లి చేసుకున్న సమీరా.. పదేళ్లుగా నటనకు దూరంగా ఉంటుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటూనే ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి.
కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో.. ఓ సినీ పరిశ్రమలో ఊహించని ఒత్తిళ్లు ఎదురైనట్లు సమీరా నటించారు. బ్రెస్ట్ ఎన్ హాన్స్ మెంట్ సర్జరీ చేయించుకోవాలని కొందరు ఆమెపై ఒత్తిడి తెచ్చారట. తనకు ఇష్టం లేదని చెప్పినా వినేవారు కాదట. “చాలామంది హీరోయిన్ చేయించుకున్నారు.. నీకేమైంది” అని బలవంతం పెట్టేవారట. తన శరీరంతో తనకు ఎలాంటి సమస్య లేనప్పుడు.. ఎందుకు సర్జరీ చేయించుకోవాలని ప్రశ్నించినట్లు చెప్పుకొచ్చింది. ఈ విషయం వల్ల ఆ సమయంలో తాను బాధపడినట్లు సమీరా ఎమోషనల్ అయింది.