ఇటీవల వరుసగా సినీ సెలబ్రెలు వివిధ కేసుల్లో అరెస్ట్ అవుతున్నాయి. బాలికపై అత్యాచారం ఘటనలో కోలీవుడ్ నటుడు కులికల్ జయచంద్రన్ అరెస్ట్ అయ్యాడు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటి హేమ, కన్నడ బ్యూటీ ఆశీరాయ్ బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కయ్యారు.ఈ కేసులో హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీలో చాలెంజింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో దర్శన్ ని అరెస్ట్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దర్శన అరెస్ట్ విషయంలో ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతకీ ఈ పవిత్ర గౌడ ఎవరు..? ఆమె బ్యాగ్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకొని కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శన్ తాజాగా ఓ హత్య కేసులో అరెస్ట్ అవడంపై అటు ఫ్యాన్స్.. ఇటు సినీ వర్గాలకు షాక్ ఇచ్చారు. రేణుకాస్వామి అనే ఓ వ్యక్తిని దర్శనం చంపించాడని నేరం రుజువు కావడంతో మైసూర్ లోని ఫామ్ హౌజ్ లో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే దర్శనం కేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవిత్ర గౌడ. ఈ కేసులో పవిత్ర గౌడను కూడా బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే పవిత్ర గౌడ ఎవరు అనే విషయం ఇప్పుడు నెటిజన్లు ఆసక్తిగా సర్చ్ చేస్తున్నారు. పవిత్ర గౌడ విషయానికి వస్తే.. కన్నడ నటి, ఫ్యాషన్ ఫ్యాషన్, దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్ గా రాణించింది. 2013లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పవిత్ర గౌడ. చత్రిగాలు సార్ చత్రిగాలు, ఆగమ్య, సాగు దారియాలి అనే సినిమాల్లో నటించింది. గతంలో ఆమె సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఖుషీ అనే కూతురు పుట్టింది. కొన్ని రోజులు వీరి దాంపత్యం హ్యాపీగా కొనసాగినా.. తాజా తర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు.
ఈ వంటినే హీరో దర్శనంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త రిలేషన్ షిప్‌కి దారి తీసింది. వీరి రిలేషన్ షిప్ గురించి 2017 లో సోషల్ మీడియాల ద్వారా బయటకు వచ్చింది. ఆ ఫోటోలపై దర్శన్ అభిమానులు తీవ్ర విమర్శలు చేయడంతో వాటిని తొలగించారు. ఇదే వ్యవహారంలో దర్శన్ భార్య విజయలక్ష్మి తరుచూ గొడవలు పడుతూ వస్తున్నాయి. రేణుకాస్వామి అనే వ్యక్తి అసభ్య మెసేజ్, అశ్లీల ఫోటోలు పంపిస్తున్నాడంటూ దర్శన్ కి ఫిర్యాదు చేసింది గౌడ. ఈ విషయం సీరియస్ గా తీసుకున్న దర్శన్ కొంతమందికి సుపారీ ఇచ్చి అతన్ని చంపించాడు. రేణుకాస్వామి హత్య కేసులో కీలక సూత్రధారి అయిన దర్శన్ అతన్ని అరెస్ట్ చేశారు.అంతేకాదు ఈ కేసులో పవిత్ర గౌడ ప్రమేయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు బెంగుళూరు పోలీసులు. ప్రస్తుతం పవిత్ర గౌడకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి