సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. అందుకే తారలు తరచూ వారి షేడ్స్ ను మారుస్తుంటారు. అప్పటి వరకు హోమ్లీగా కనిపించిన బ్యూటీలు ఎవరిసాగా హాట్ హాట్ గా మారిపోతుంటారు. దీంతో షాక్ అవ్వడం ప్రేక్షకుల వంతు అవుతుంది. అయితే తాము మారడగానికి గల కారణాలను కొందరు నటిమణులు వివరణ ఇస్తారు. అలానే తాజాగా గుప్పెడంత మనసు సీరియల్ నటి కూడా తన గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఆ సీరియల్ లో జగతి పాత్రలో నటించిన జ్యోతిరాయ్..ప్రస్తుతం అందాలు ఆరబోస్తు..రచ్చ చేస్తుంది. దీంతో ఆమెపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండగా..ఆమె బో*ల్డ్ కామెంట్స్ చేసింది. తను ఆ యాంగిల్ లోనే చూస్తున్నారంటూ చెప్పుకొచ్చింది.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అనేక సీరియల్స్ ఎంటర్ టైన్ చేస్తున్నారు. అలాంటి వాటిలో ఒక్కటే గుప్పెడంత మనస్సు సీరియల్. ఇందులో హీరో క్యారెక్టర్ నటించిన రిషిక్ తల్లిగా జగతి అనే పాత్ర జ్యోతిరాయ్ చేసింది. అసలు తల్లి అంటే ఇలా ఉంటుందా అంటే అంతలా ఆ సీరియల్ లో ఆకట్టుకుంది. మిడిల్ ఏజ్ హోమ్లీ పాత్రలో జ్యోతిరాయ్ మెస్మరైజ్ చేసింది. ఆమెను తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ప్రత్యేక అభిమానం పెంచుకున్నారు. తమ కుటుంబ సభ్యురాలిగా వారు ఓన్ చేసుకున్నారు. ఇక అనూహ్యంగా ఆ సీరియల్ లో ఆమె క్యారెక్ట రు చంపేసి..తొలగించారు. ఇది ఇలా ఉంటే..ఆమె సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. బికినీలు ధరించి ఆమె బుల్లితెర ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. తాము చూస్తున్నది జగతి పాత్రలోని జ్యోతిరాయ్ నేనా లేక మరెవరైనా అనేంతలా మారిపోయింది. ఈమెపై సోషల్ మీడియా ట్రోల్ ఎదురయ్యాయి.
తనపై వచ్చిన ట్రోల్స్ పై తాజాగా జ్యోతిరాయ్ ఘాట్ గా స్పందించారు. ప్రస్తుతం ఆమె ‘ఏ మాస్టర్ పీస్’ అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల. ఇక మూవీ ప్రమోషన్ లో భాగంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న జ్యోతి రాయ్… ట్రోల్స్ ని ఉద్దేశించి మాట్లాడింది. మనం ఒక ప్రొఫెషన్ లో ఉన్నామని, మోడల్ పాత్రలు వస్తే వాటికి తగ్గట్లుగా, ట్రెడిషనల్ పాత్రలు వస్తే అందుకు తగ్గట్లుగానే మారిపోతానని ప్రకటించారు. తనను ట్రోల్స్ చేసే వారు..అది వారి మెంటాలిటీకి సంబంధించినదని, వాళ్లు ఏదో ట్రోల్స్ చేస్తారని తాను పోటోలు పెట్టడం లేదని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం అంతా సోషల్ మీడియాలోనే నడుస్తుంది. నేను ఇలానే ఉంటాను అంటే కుదురదని. చాలా మంది తనను గుప్పెడంత మనసు జగతి పాత్రలోనే చూస్తున్నారని, కానీ తాను అంతకు ముందు ఓ షోలో 60 ఎపిసోడ్స్ మోడ్రన్ డ్రెస్సుల్లో చేశానని చెప్పుకొచ్చింది. మొత్తంగా ప్రొఫెషన్ కోసం గ్లామరస్ ఫోటో షూట్స్ తప్పదని, క్యారెక్టర్ కి తగ్గట్లు మారతామని ఈ బ్యూటీ పరోక్షంగా చెప్పింది. మరి.. ఈమె చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.