ఒకప్పటి స్టార్లు ఏడాదికి ఐదు నుంచి పది సినిమాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పటి స్టార్ల నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావడమే గగనమైపోయింది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రెండు మూడేళ్లకు ఒక సినిమా వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది. అయితే ఈ పాన్ ఇండియా ట్రెండ్ లోనూ ప్రభాస్ (ప్రభాస్) మాత్రం వరుస సినిమాలతో అలరిస్తున్నాడు.
టాలీవుడ్ నుంచి మొదట పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నది ప్రభాసే. అయితే ‘బాహుబలి-2’ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాల కోసం కాస్త సమయం తీసుకున్న ప్రభాస్.. ఇప్పుడు ఎలాంటి గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చేస్తున్నవన్నీ భారీ సినిమాలే అయినా.. విశ్రాంతి అనేది లేకుండా, చాలా త్వరగా సినిమాలను పూర్తి చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. జూన్‌లో ‘ఆదిపుష్’, డిసెంబర్‌లో ‘సలార్-1’తో పలకరించిన ప్రభాస్.. ఈ జూన్‌లో ‘కల్కి 289 ఏడీ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంటే ఏడాది వ్యవధిలో ప్రభాస్ నుంచి ఏకంగా మూడు భారీ సినిమాలు వచ్చినట్లు. అంతేకాదు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ల లిస్టు కూడా పెద్దదే. ‘రాజా సాబ్’, ‘సలార్-2’, ‘కల్కి-2’, ‘స్పిరిట్’, ‘హను రాఘవపూడి ప్రాజెక్ట్’ ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రభాస్ దూకుడు చూస్తుంటే.. ఏడాదికి కనీసం రెండు సినిమాలు వచ్చేలా ఉన్నాయి.
ప్రభాస్ తో మిగిలిన మిగిలిన స్టార్ హీరోలు పూర్తిగా వెనకబడిపోయారు. గత ఆరేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నుంచి కేవలం రెండు సినిమాలే వచ్చాయి. 2018లో ‘అరవింద సమేత’, 2022లో ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యాయి. ఈ అక్టోబర్ లో ‘దేవర’తో పలకరించనున్నాడు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో.. తన ప్రైమ్ టైంలో ఇంత నెమ్మదిగా సినిమాలు చేయడం.. తన కెరీర్ కే కాదు సినీ పరిశ్రమకి కూడా మంచిది కాదు. కానీ ఇదే బాటలో మిగిలిన స్టార్ హీరోలు కూడా పయనిస్తున్నారు.
రామ్ (Ram Charan) ఒక్కో సినిమాకి రెండు మూడేళ్ళ చరణ్ సమయం తీసుకుంటున్నాడు. 2019లో ‘వినయ విధేయ రామ’ విడుదలైతే.. 2022లో ‘ఆర్ఆర్ఆర్’ వచ్చింది. నెక్స్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది చివరిలో రానుంది. ఇక అల్లు అర్జున్ (అల్లు అర్జున్) అయితే గత నాలుగేళ్లుగా ‘పుష్ప’ ఫ్రాంచైజ్ కి పరిమితమయ్యాడు. 2021లో ‘పుష్ప-1’ వచ్చింది. ఈ ఏడాది ‘పుష్ప-2’ రానుంది.
మహేష్ బాబు (మహేష్ బాబు) పాన్ ఇండియా స్టార్ గా మారకముందే ఒక్కో సినిమాకి రెండేళ్ల సమయం తీసుకున్నాడు. 2020లో ‘సరిలేరు నీకెవ్వరు’, 2022లో ‘సర్కారు వారి పాట’, 2024లో ‘గురువు కారం’ విడుదలయ్యాయి. తన తదుపరి సినిమాని రాజమౌళితో చేస్తున్నాడు కాబట్టి.. ఇంకో రెండు మూడేళ్లు మహేష్ సినిమా వచ్చే పరిస్థితి లేదు. ఈ లెక్కన చూస్తే.. పవన్ కళ్యాణ్ (పవన్ కళ్యాణ్) ఎంతో నయమని చెప్పవచ్చు. గత మూడేళ్ళుగా కనీసం ఒక సినిమా విడుదల చేస్తూ ఉన్నాడు. అలాగే పలు సినిమాలు చేతిలో ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ని వదిలేస్తే.. మిగిలిన స్టార్ హీరోలు మాత్రం ప్రభాస్ ని చూసి నేర్చుకోవాల్సి ఉంది. ఏడాదికి రెండు మూడు సినిమాలు కాకపోయినా.. కనీసం ఒక్క సినిమా అయినా విడుదలయ్యేలా చేస్తే.. వారి కెరీర్ బాగా పాటు సినీ పరిశ్రమకు కూడా ఎంతో మేలు చేస్తారు.