అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగిన హీరో రవితేజ. అవకాశాల కోసం కొత్త డైరెక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, వారి కష్టాలు ఎలా ఉంటాయో రవితేజకు తెలుసు. అందుకే హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో మంది డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చాడు రవితేజ. ఇప్పుడు తన 75వ సినిమాకి మరో కొత్త డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు.
గత సంవత్సరం వాల్తేరు వీరయ్య, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, రావణాసుర లాంటి సినిమాలతో అలరించిన రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘మిస్టర్ బచ్చన్’ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా పూర్తవకముందే మరో సినిమా స్టార్ట్ చేసారు. ఈ సినిమా ద్వారా భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్‌ని పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా పూజ కార్యక్రమాలతో మంగళవారం. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్.
రవితేజ 75వ సినిమా డైరెక్టర్‌గా పరిచయమవుతున్న భాను భోగవరపు గతంలో ‘సామజవరగమన’ చిత్రం రచయితగా వర్క్ చేశాడు. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ధమాకా’ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలకు రవితేజ, శ్రీలీల వేసిన స్టెప్స్ అందర్నీ ఆకట్టుకున్నారు. మరోసారి వీరి కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ భాను చేస్తున్న కొత్త సినిమాలో ఈ జంట ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బేనర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ నిర్మాణారు. 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్.