నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్థాపించిన తెలుగుదేశం పార్టీ (తెలుగుదేశం పార్టీ) నిర్మాణంలో చైతన్య రథ సారథిగా హరికృష్ణ కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రాజకీయాలకు, తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ.. వారి సినిమాలేవో చేసుకుంటున్నారు. కానీ, తాము టీడీపీ మద్దతుదారులం కాదని వారు ఎక్కడా ప్రకటించలేదు. అయినప్పటికీ వారిని తెలుగుదేశానికి దూరం చేస్తూ.. టీడీపీకి, హరికృష్ణ కుటుంబానికి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ (బాలకృష్ణ) తర్వాత ఆ స్థాయిలో ప్రముఖ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గుర్తింపు తెచ్చుకున్నాడు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారం కూడా చేశాడు. అప్పుడు జూనియర్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే అనూహ్యంగా రోడ్డు ప్రమాదం జరిగింది.. చావు అంచుల వరకు వెళ్లి, ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటినుంచి ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటున్నాడు తారక్. పైగా తనది చాలా చిన్న వయసు కావడంతో.. ముందు సినీ కెరీర్ పై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా అని తాను టీడీపీకి పూర్తిగా దూరం జరగలేదు. అది తన తాత స్థాపించిన పార్టీ అని, ప్రాణం పోయేవరకు తాను తెలుగుదేశంతోనే ఉంటానని చెప్పాడు. అప్పటి నుంచి తన సినిమాలేవో తాను చేసుకుంటున్నాడు. అదే విధంగా అవసరమైన సమయాల్లో పార్టీ తరపున సూచించూ వచ్చాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు, అసెంబ్లీలో తన మేనత్త నారా భువనేశ్వరికి అవమానం జరిగినప్పుడు.. జూనియర్ తన స్థాయికి తగ్గట్టుగా హుందాగా స్పందించాడు. కానీ కొందరు దానిని తప్పుబట్టారు. జూనియర్ కి తాతపైన, కుటుంబంపైన ప్రేమ లేదని.. అందుకే సౌమ్యంగా స్పందించాడని టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థి పార్టీ వేసిన ఈ ట్రాప్ లో మొదట్లో కొందరు టీడీపీ నేతలు కూడా పడ్డారు. అప్పటి నుంచి పొలిటికల్ స్టేట్మెంట్స్ కి కూడా పూర్తిగా దూరమయ్యాడు జూనియర్. స్పందించి అనవసరమైన రాద్ధాంతానికి కారణమవ్వడం కంటే మౌనంగా ఉండటమే ఉత్తమం అనుకున్నాడు. అందుకే, చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా స్పందించలేదు. కానీ ఆ మౌనం కూడా అతనిని ఇబ్బంది పెట్టింది. బాబు అరెస్ట్ తో జూనియర్ హ్యాపీగా ఉన్నాడని, అందుకే స్పందించలేదని.. ప్రత్యర్థి పార్టీ విష ప్రచారం మొదలుపెట్టింది. ఇలా టీడీపీకి, జూనియర్ కి మధ్య చిచ్చు పెట్టడానికి ఎంత విష ప్రచారం చేయాలో అంతా చేసింది. అయితే దీనిని మెజారిటీ టీడీపీ శ్రేణులు, జూనియర్ అభిమానులు గుర్తించి.. వారి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు.
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు (చంద్రబాబు) ఘన విజయం సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. బాబు గెలుపుకి సినీ పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అయితే తారక్ మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించాడు. మొదట.. బాబు గెలవడం జూనియర్ కి ఇష్టం లేదని, అందుకే ట్వీట్ కూడా చేయలేదని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. ఇక చివరికి ఎన్టీఆర్ ట్వీట్ చేయడంతో.. చంద్రబాబు గెలిచాక మామ అంటూ, లేని ప్రేమని నటిస్తూ.. దగ్గరవుతున్నాడంటూ కొత్త ప్రచారానికి తెరదీశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్ గోవాలో ఉన్న ఎన్టీఆర్.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వస్తాడా లేదా అనే సస్పెన్స్. ఆయన ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ ఫిక్స్ అయిందట. ఇలా ఎన్టీఆర్ ఏం చేసినా, చేయకపోయినా.. ఏం మాట్లాడినా, మాట్లాడకపోయినా.. పొలిటికల్ గా టార్గెట్ అవ్వడం మాత్రం పక్కా అయిపోయింది.
తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ ని కూడా కొందరు టార్గెట్ చేస్తున్నారు. తమ్ముడు కంట్రోల్ లో కళ్యాణ్ రామ్ ఉంటున్నాడని.. అతను స్పందిస్తే స్పందించడం, లేదంటే అతనిలాగే మౌనంగా ఉన్నాడని.. ఇద్దరూ కలిసి తెలుగుదేశాన్ని బలహీనపరిచి, భవిష్యత్ లో తమ చేతుల్లోకి తీసుకునే కుట్ర ప్రచారం చేస్తున్నారు. ఇదంత దగ్గర నుంచి గమనిస్తున్న రాజకీయ పండితులు.. టీడీపీ-హరికృష్ణ కుటుంబం మధ్య లేని అఘాయిత్యాన్ని సృష్టించి, లబ్దిపొందే ప్రయత్నం ప్రత్యర్థి పార్టీ చేస్తుందని.. దీనిని టీడీపీ శ్రేణులు, జూనియర్ అభిమానులు గుర్తించాలని సూచిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని ఉపయోగించి చేతులు కాల్చుకున్న ప్రత్యర్థి పార్టీ.. ఇప్పటికీ తన తీరును మార్చుకోకపోవడం విచిత్రంగా ఉంది.