ఇటీవల కాలంలో ఎన్నో హర్రర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చాలా సినిమాలు కామెడీతో కూడిన హర్రర్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరిన్ని సినిమాలు అయితే ప్రేక్షకులను వణికించేలా చేశాయి. గతంలో మసూద, పొలిమేర, పొలిమేర-2, విరూపాక్ష వంటి హర్రర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా బాక్సాఫీస్ వద్ద సూపర్ హీట్ గా నిలిచాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శర్వరి వాఘ్ ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ మూవీ ముంజ్యా. జూలై 7వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే…ఈ సినిమాలో హీరోయిన్ బాహుబలి కట్టప్పపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ బ్యూటీ శర్వారి పాత్రలో నేష్ విజన్ బ్లాక్ బస్టర్ హార్రర్ కామెడీ యూనివర్సలో భాగంగా తెరకెక్కిన సినిమా ముంజ్యా. జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరో కామెడీతో పాటు భయపెట్టే అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే.. డిఫరెంట్ స్టోరీ కలిగిన ఈ అయితే ముంజ్యా సినిమాలో ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు. ఇక బాహుబలి సినిమాలో కట్టప్పగా చేసిన సత్యరాజ్ పాత్రతో ముంజ్యాకు కనెక్షన్ ఉంది. అది సినిమా చూస్తే..తెలుస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే బాహుబలి కట్టప్ప అయిన సత్యరాజ్ పై ముంజ్యా హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సత్యరాజ్‌తో పని అనుభవం గురించి హీరోయిన్ శర్వారి వాఘ్ చెబుతూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ సత్యరాజ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు రాజమౌళి అంటే ఇష్టమని, ఆయన తీసిన బాహుబలి సినిమాకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది. ఆ సినిమా చాలా సార్లు చూశానని, ఇక ఆ మూవీలో కట్టప్పగా చేసిన సత్య రాజ్ గారితో తాను స్క్రీన్ షేర్ చేసుకోబోతోన్నానని తెలియడంతో తన అవధులు లేవని చెప్పుకొచ్చింది. షూటింగ్ లో సత్యరాజ్ అంకితభావం, నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యం కలిగిందని, ఆయన్నుంచి చాలా నేర్చుకున్నానని శర్వరి వాఘ్ టైం అందించాడు.
ఎలాంటి సన్నివేశంలోనైనా సరే సత్యరాజ్ సర్ ఎంతో నిబద్ధతతో ప్రతి సన్నివేశానికి జీవం పోశారని చెప్పింది. అదనంగా ఆయనతో కలిసి మళ్లీ పని చేయాలని ఉంది, అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు ఈబ్యూటీ విడుదల. ఇక ముంజ్యా సినిమా విషయానికి వస్తే.. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించగా, దిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి..మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదట మంచి కలెక్షన్స్ తెచ్చుకున్న ఈ హర్రర్ చిత్రం మొదటి వారం రోజుల్లో వసూళ్లు తగ్గిపోయాయి. మోనా సింగ్, శర్వరి వాఘ్, అభయ్ వర్మ నటించిన ముంజ్యా సినిమాలో నటించారు. మొత్తంగా సత్యరాజ్ పై శర్వరి వాఘ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.