నాగ్ అశ్విన్ తన ప్రపంచంలో తీసుకువెళ్ళడానికి అందరిని సిద్ధం చేసాడు. ఈ కారణంగానే కల్కి ప్రపంచం గురించి అందరికి అర్ధం అవ్వడానికి .. ట్రైలర్ కంటే ముందే.. ఈ సినిమాకు సంబంధించి ఓ యానిమేటెడ్ సిరీస్ ను కూడా రిలీజ్ చేశారు. దానిలో అసలు కల్కి వరల్డ్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్నీ చాలా క్లియర్ గా చూపించారు . ఇక ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ ట్రైలర్ గురించే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న ప్రశ్నలతో పాటు.. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా చాలా ప్రశ్నలు అందరికి మొదలయ్యాయి. ఇక తాజాగా బిగ్ బీ అమితాబ్ కూడా ఈ విషయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.
బాలీవడ్ స్టార్ అమితాబ్ కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత అమితాబ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీ గురించి మొదటి నుంచి అందరికి చాలా ప్రశ్నలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇది ట్రైలర్ రిలీజ్ తర్వాత.. పూర్తి క్లారిటీ కాకపోయినా.. అందరికి క్యారెక్టర్స్ విషయంలో కాస్త క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామగా కనిపించాడని అందరికి అర్ధమయ్యింది. ఇక ట్రైలర్ విడుదలైన తర్వాత.. బిగ్ బీ మూవీ గురించి కొన్ని పాజిటివ్ విషయాలు చెప్పారు.అలాగే అమితాబ్ తనయుడు అభిషేక్ కూడా తన తండ్రిని ప్రస్తావిస్తూ.. తన సోషల్ మీడియా ఖాతాలో “మైండ్ బ్లోయింగ్” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. కల్కి తర్వాత.. కేవలం ఇల్లు గడవడానికి ఇంకొక పని దొరికితే చాలని అనుకుంటున్నాను అంటూ అమితాబ్ చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి భారీ లెవెల్ లో బజ్ నడుస్తుంది. ఇక రిలీజ్ తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో.. ఈ మూవీ క్రేజ్ ఎలా ఉండబోతుందో.. వేచి చూడాలి. మరి ఈ సినిమాపై అమితాబ్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.