సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించిన వారు.. తర్వాత కాలంలో సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ బిగినింగ్ లో విలన్లుగా నటించినవారే. బుల్లితెరపై ‘సర్కాస్’ సీరియల్‌లో నటించిన ఒక సామాన్యుడు ఇప్పుడు బాలీవుడ్ ని ఏలేస్తున్నాడు. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించినప్పటికీ హీరో రేంజ్ లో పేరు తెచ్చుకున్నాడు. హీరోగా మారిన తర్వాత బాలీవుడ్ ని ఏలే స్టార్ హీరోగా మారాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? పూర్తి వివరాల్లోకి వెళితే..
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం లేదు. ఇటీవల ఆయన నటించిన పఠాన్, జవాన్ తెలుగు లో కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి.ఢిల్లీలో పుట్టి పెరిగిన షారూఖ్ ఖాన్ సినిమాలపై మోజుతో ముంబై వచ్చి స్టూడియోల చుట్టూ తిరిగాడు. ముంబైలో ఉండేందుకు ఇల్లు లేక బీచ్ పక్కన, షాపింగ్ మాల్స్ వద్ద పడుకునే వాడినని పలు ఇంటర్వ్యూలో చెప్పారు. కెరేర్ బిగినింగ్ లో చిన్న చిన్న సీరియల్స్ లో ఛాన్సులు వచ్చాయనీ.. వాటిని మిస్ చేసుకోకుండా నటిస్తూ వెండితెరపై ఫోకస్ పెట్టానని తెలిపాడు. 1992 లో వచ్చిన దీవానా మూవీ అతనికి మంచి ఛాన్స్ లు వచ్చేలా చేశాయి. ఈ మూవీలో సెకండ్ హీరోగా నటించాడు షారూఖ్ ఖాన్.
1993లో వచ్చిన బాజీగర్, డర్ మూవీలో విలన్ గా దుమ్మురేపాడు. విలన్ అయినప్పటికీ హీరో రేంజ్‌లో పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నెగిటీవ్ పాత్రలు వచ్చాయి.. వాటన్నింటిని రిజక్ట్ చేశాడు. హీరోగా చిన్న సినిమాల్లో నటిస్తూ 1995లో వచ్చిన ‘దిల్ వాలే దుల్హనియా లేజాయింగే’ మూవీ షారూఖ్ లైఫ్ ని పూర్తిగా మార్చేసింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. తర్వాత మాస్ హీరోగా ప్రేక్షకుల మన్ననలు పొందాడు. నటుడిగానే కాదు పలు యాడ్స్ లో నటిస్తున్నాడు. ఐపీఎల్ జట్టు కోల్‌కొతా రైడర్స్ సహ యజమానిగా ఉన్నారు. షారూఖ్ ఆస్తులు దాదాపు 6 వేల కోట్లకు పైగా ఉన్నాయని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. అంతేకాదు ముంబైలో షారూఖ్ నివాసం మన్నత్ భననం చూస్తే ఆయన జీవన శైలి ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది.