ఆయన మాములు వ్యక్తి కాదు.. సూపర్ స్టార్ కృష్ణ(కృష్ణ)కి మొదటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తి. ఆయన ఎవరో కాదు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు. పైగా మొదటి నుంచి కృష్ణ కి ఆయన అభిమానులకి మధ్య సంధాన కర్త కూడా.దీంతో కృష్ణ గారిని ఎలా అయితే ఫ్యాన్స్ అభిమానించారో ఆదిశేషగిరిరావు ని కూడా అలాగే అభిమానిస్తారు. మహేష్ ఫ్యాన్స్ కూడా అంతే. ఇక కృష్ణ, సినిమాలకి నిర్మాతగా కూడా నటించాడు. అలాంటి వ్యక్తి నేడు కన్నీళ్లు పెట్టుకోవడం టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు(nara chandrababu naidu)ప్రమాణ స్వీకారం చేసారు. నాలుగో సారి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. దీంతో సినీ పరిశ్రమకి చెందిన ఎంతో మంది ప్రముఖులు. ఆదిశేషగిరిరావు(adiseshagiri rao) కూడా హాజరయ్యాడు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన స్వర్గీయ కృష్ణ గారి అభిమానులు ఒక్కసారి గతంలోకి వెళ్లారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ప్రచారం కూడా చేసాడు. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు.
ఆ విషయాన్నీ అలా ఉంచితే ప్రస్తుతం తాడేపల్లిలో జగన్ ఉంటున్న ఇంటిని ఆదిశేషగిరిరావు నే తన సొంత ఖర్చులతో కట్టించాడు. కానీ కనీస కృతజ్ఞత కూడా లేకుండా ఆదిశేషగిరిరావు ని జగన్ రకలుగా హింసించాడు. ఈ విషయం చాలా మందికి తెలుసు. కృష్ణ ,మహేష్ ఫ్యాన్స్ కూడా ఆ విషయంలో బాగానే బాధ పడ్డారు. అందుకే మొన్న ఎలక్షన్స్ లోఅభిమానులు జగన్ ని చిత్తు చిత్తుగా ఓడించారనే టాక్ ఉంది. 2019 లో ఆదిశేషగిరిరావు టిడిపి లో చేరాడు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ని వైసిపీ వాళ్ళు అనరాని మాటలు అన్నప్పుడు ఆమె ని కలిసి ధైర్యం చెప్పి మంచి రోజులు వస్తుందని చెప్పారు. అదే విధంగా ప్రమాణ స్వీకార సమయంలో చంద్రబాబు బామ్మర్ది ఎన్టీఆర్ కొడుకైన రామకృష కూడా భావోద్వేగానికి లోనయ్యాడు.