వయస్సుకు మించిన రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు కొంత మంది నటీమణులు. ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కాదు. ఎప్పటి నుండో ఈ ధోరణి కొనసాగుతుంది. ఒకప్పుడు కన్నాంబ, అంజలి, నిర్మలమ్మ వంటి నటీమణులు చిన్న వయస్సులోనే అమ్మ, వదిన, బామ్మ పాత్రలు పోషించిన సంగతి విదితమే. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఓ తరం హీరోలకు అమ్మ పాత్ర అనగానే అన్నపూర్ణమ్మ, సుధ మాత్రమే కనిపించారు. వీరంతా కూడా హీరోల కన్నా చిన్న వయస్సు అయినప్పటికీ.. పెళ్లైన కారణంగా వీరికి ఇలాంటి క్యారెక్టర్లు మాత్రమే పలకరించేవి. హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా.. వీటికే పరిమితం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆ బాధితురాళ్లలో ఈ మేడం కూడా ఒకరు.
ఇప్పుడంటే కాస్త ట్రెండ్ మారింది. పిల్లలు హీరోయిన్లుగా రాణిస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కానీ ఒక్కసారి ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా తాళి బొట్టు మెడలో పడిందా.. మెయిన్ రోల్ నుండి సైడ్ రోల్ మారిపోవాల్సిందే. ఇదిగో ఈ ఫోటోలోని ముద్దుగుమ్మ కూడా ఆ కోవకే వస్తుంది. దక్షిణాది ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మెరిసి.. పెళ్లి చేసుకోవడంతో అమ్మ, అత్త, వదిన, ఆక్క పాత్రలకే పరిమితం అయ్యింది. ఏజ్ కన్నా క్యారెక్టర్ బరువుగా ఉండేది. అయినా అలాంటి పాత్రలతోనే గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి. ఇంతకు ఆమె ఎవరంటే.. టాలీవుడ్ అందాల అమ్మ,అత్తమ్మ ప్రగతి. ఒంగోలు వాసి అయిన ఈ అచ్చ తెలుగు అమ్మాయి.. చిన్న వయస్సులోనే మోడల్‌గా కెరీర్ స్టార్ చేసింది. నటుడు భాగ్యరాజ్ ఆమెను తమిళ పరిశ్రమకు పరిచయం చేశాడు.
వీట్ల విశేషగణతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రగతి.. అతి తక్కువ సమయంలోనే ఏడు సినిమాల్లో నటించింది. ఓ మలయాళ మూవీలో యాక్ట్ చేసింది. బుల్లితెరలోనూ సందడి చేసింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. పెళ్లి చేసుకుంది. మూడు గ్యాప్ తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంది. ఈ సారి ఆమెను తల్లి పాత్రలు పలకరించాయి. బాబీ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, గంగోత్రి వంటి చిత్రాలు ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌కు పునాది వేశాయి. అక్కడ నుండి వెనుదిగిరి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హీరోయిన్ మెటీరియల్ అయినా.. సైడ్ క్యారెక్టర్లతో సరిపెట్టుకుంది.ఇంచు మించు ఇప్పటి తరం స్టార్ హీరోలందరికీ తల్లిగా లేదా అత్తగా కనిపించింది టాలీవుడ్ తారామణి. ప్రస్తుతం సీరియల్స్, సినిమాలు చేస్తూనే మరో వైప్.. జిమ్ వర్కౌట్స్ చేస్తుంది. ఇదేదో సరదా అనుకున్నారు. కానీ పవర్ లిఫ్టింగ్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెడల్ కూడా అందుకు ఔరా అనిపించుకుంది. ఆమెలో కనిపించని కోణాన్ని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. నెటిజన్లకు ఝలక్ ఇస్తుంది. బైక్ రైడ్స్, వర్కౌట్స్ తో పిచ్చెక్కుతోంది ప్రగతి.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి