టాలీవుడ్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ ‘పృథ్వీరాజ్’ గురించి అందరికీ తెలుసు. ఈయన టాలీవుడ్ లోని ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఒక రకంగా చెప్పాలంటే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ కమెడియన్స్ లో పృథ్వీరాజ్ కూడా ఒకరు. ఇలా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పృథ్వీరాజ్. కానీ, రాజకీయాలు అనేవి పృథ్వీ రాజ్ కు అంతగా కలిసి రాలేదు. దీంతో మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలపెట్టిన పృథ్వీ ఆడపాదడపా సినిమాలు చేస్తున్నారు.
ఇక పృథ్వీరాజ్ పర్సనల్ లైఫ్ విషపయానికి వస్తే.. ఆయనకు తన భార్య శ్రీలక్ష్మి తో గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే పృథ్వీ రాజ్ తన కుటుంబంతో గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో తన భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షలు భరణం ఇప్పించాలని కోరింది. అయితే తాజాగా పృథ్వీరాజ్ కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఊహించని షాక్ ను ఇచ్చింది. ముఖ్యంగా కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు.. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో 1984లో వివాహమైంది. కాగా, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో.. కొన్నేళ్లుగా పృథ్వీ రాజ్ భార్యతో విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటుంది. ఈ కోరికనే.. శ్రీలక్ష్మి 2017లో కోర్టును ఆశ్రయించింది. అలాగే తన భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది. అలాగే.. పృథ్వీరాజ్ విజయవాడలో తన అమ్మ ఇంట్లో ఉంటూనే చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నీ తమ తల్లిదండ్రులే భరించారని ఆమె కోర్టుకు విడుదల చేసింది. అయితే సినిమాల్లోకి వెళ్లాక పృథ్వీ రాజ్ తనని తరచూ వేధించేవాడని, ఇదే తనని 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి బయటకు కూడా పంపించేశాడని చెప్పుకొచ్చింది. అందుకే తాను తన పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఇక తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కనుక అతని నుంచి తనకు భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న న్యాయస్థానంలో శ్రీలక్ష్మీ కేసు దాఖలు చేసింది. అయితే ఈ కేసు లక్షలు విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు.. పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు 8 రూపాయలు, అంతేగాక ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులు కూడా ఆయనే అందించిన తీర్పునిచ్చింది. అలాగే ప్రతి 10వ తేదీ నాటికి ఆమెకు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల భరణం చెల్లించాల్సిన విషయంలో పృథ్వీరాజ్ విఫలం అయినట్లు తెలుస్తోంది. ఆయన కోర్టుకు కూడా హాజరుకావడం లేదని వార్తలు వస్తున్నాయి. దీనితో పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ వార‐ను విజయవాడ ఫ్యామిలీ కోర్టు అరెస్ట్ అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. మరి,నటుడు పృథ్వీరాజ్ కు ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
.