యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ రాజమౌళి కాంబోలో వచ్చిన మూవీ యమదొంగ. అందులో ఎన్టీఆర్ కి డబ్బులు అప్పుగా ఇచ్చే ధనలక్ష్మి క్యారక్టర్ లో అద్భుతంగా నటించిన భామ మమతా మోహన్ దాస్(mamta mohandas)ఈజీ నటన ఆమె బలం. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో విభీమన్నమైన పాత్రలని పోషించి మంచి నటిగా గుర్తింపు పొందింది. కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ భారిన పడింది. ఇప్పుడు ఆ వ్యాధి నుండి కోలుకొని రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి అప్ కమింగ్ మూవీ మహారాజా(మహారాజ)ఈ నెల 14న విడుదల కాబోతుంది. మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా చేస్తుంది. మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా డేటింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పింది. లాస్ ఏంజిల్స్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించాను.కానీ ఎక్కువ రోజులు ఆ బంధం నిలవలేదు. లైఫ్ లో రిలేషన్ ఉండాలి. కానీ అది ఒత్తిడితో కూడిన బంధంగా ఉండకూడదు. అసలు జీవితానికి ఒక తోడు అవసరమనే విషయంతో నేను ఏకీభవించను. ప్రస్తుతానికి చాలా సంతోషంగా ఉన్నాను. కాకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. మంచి జీవిత భాగస్వామి కోసం అయితే వెతుకుతున్నా.సమయం వచ్చినప్పుడు అన్ని బయటకి వస్తాయి అని చెప్పింది.
మమతా మోహన్ దాస్ మంచి సింగర్ కూడాను. ఎన్టీఆర్ రాఖి మూవీలోని టైటిల్ సాంగ్ రాఖీ రాఖీ నా కవాసకి, అలాగే శంకర్ దాదా జిందాబాద్ లోని ఆకలేస్తే అన్నం పెడతా తన గళం నుంచి జాలు వారినవే. ఆ రెండే కాదు చాలా సినిమాల్లో పాటలు పాడింది. వార్తల్లో ఇతర బాషా చిత్రాలు ఉన్నాయి. నటిగాను ఇతర బాషా చిత్రాల్లోనూ నటించింది.