ప్రస్తుతం దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానీ వంటి ప్రముఖ నటులు నటించిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ బుజ్జి కారు ఆకర్షణగా నిలిచింది. భైరవ, బుజ్జి మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా ఉండబోతున్నాయి. ఇక ఈ కారుని ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేసారు. ఏకంగా ఈ కారు కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక ఈ సినిమా కోసం 600 కోట్లు బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్ ఎలాంటి కారు వాడుతున్నారో తెలుసా?
దర్శకులకు, హీరోలకు ఖరీదైన లగ్జరీ కార్లు ఉండటం మామూలే. చిన్న సినిమాలు తీసి హిట్ కొడుతున్న దర్శకులకే ఇప్పుడు మంచి లగ్జరీ కార్లు ఉన్నాయి. చిన్న చిన్న యూట్యూబర్స్ కి కూడా ఇప్పుడు బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి. అలాంటిది కల్కి వంటి భారీ బడ్జెట్ తీస్తున్న నాగ్ అశ్విన్ దగ్గర ఎలాంటి కారు ఉంటుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ బెంజో, బీఎండబ్ల్యూనో, ఆడి హై అండ్ మోడల్ కారు అని అనుకుంటున్నారా? కానీ నాగ్ అశ్విన్ చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన వాడేది ఒక ఎలక్ట్రిక్ కారు. అది కూడా మహీంద్రా కంపెనీకి చెందిన కారు. కల్కి సినిమా కోసం బుజ్జి కారు కూడా మహీంద్రా కంపెనీ చేసిందే.
యాదృచ్చికమో లేక ఆయన మహీంద్రా కంపెనీ మీద ఉన్న నమ్మకంతో కొన్నారో తెలియదు గానీ ఆయన తిరిగేది.. కల్కి సినిమాలో వాడిన కారు బ్రాండ్ మహీంద్రానే. ఇక నాగ్ అశ్విన్ తిరిగే కారు మహీంద్రా e2o. ఇది ఎలక్ట్రిక్ కారు. దీని ధర 10 లక్షల నుంచి 11 లక్షల రూపాయలు ఉంటుంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఈ కారులో తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 600 కోట్ల సినిమా తీసి ఏంటి స్వామి నువ్వు ఇంత చిన్న కారులో తిరుగుతున్నావ్.. ఇది కదా సింప్లిసిటీ అంటే కామెంట్స్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ సినిమాల టేకింగ్ లో రిచ్ నెస్ చూపిస్తారు గానీ బయట మాత్రం చాలా సింపుల్ గా, మిడిల్ క్లాస్ పర్సన్ లా ఉంటానని కామెంట్స్ చేస్తున్నారు.
వీడు ఏంటి రా ఎంత సింపుల్ గా ఉన్నాడు 600 కోట్ల సినిమా తీసి ఒక బుడ్డి కార్ వేసుకుని తెరిగేస్తున్నాడు 💪🏻😍#ప్రభాస్ #kalki2898ad #Kalki2898ADOnJune27 pic.twitter.com/8tT8jwfbC0
— మణి (@మనీరెబెలిజం) జూన్ 12, 2024