హీరో, హీరోయిన్ కాంబినేషన్ కి ఒక క్రేజ్ ఉందని అనుకుందాం. ఆ ఇద్దరు మినిమమ్ ఒక్క రెండు, మూడు హిట్ సినిమాల్లో కలిసి చేస్తే గాని క్రేజ్ రాదు. కానీ ఆ కాంబోలో ఒక్క సినిమా కూడా రాకుండా క్రేజ్ వస్తే. అదెలా సాధ్యం అనుకుంటున్నారా! కట్ అవుట్ చూసి కొన్ని నమ్మెయ్యాలి అని ప్రభాస్ చెప్పినట్టుగా ఆ ఇద్దర్ని చూస్తేనే అర్ధం అవుతుంది.
మమ్ముట్టి(mammootty)అండ్ సమంత(samantha)ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఏ మాయ చేసావే ఫేమ్ గౌతమ్ వాసుదేవ మీనన్ దర్సకత్వంలో మమ్ముట్టి హీరోగా ఓ మూవీ రాబోతుంది. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం అధికార ప్రకటన కూడా వచ్చింది. హీరోయిన్ గా నయనతారని ఎంపిక చేసారు కూడా. కానీ ఇప్పుడు నయన్ ప్లేస్ లో సమంత చేరిందనే మాటలు వినిపిస్తున్నాయి. స్టోరీ విన్న సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా అంటున్నారు.ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సమంత స్వతహాగా పక్కా మలయాళీ. తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ సంపాదించిన చాలా ఏళ్ళ తర్వాత తన స్వంత భాషలో ఉంటుంది. ఈ కేరళ కుట్టి చాలా ఇంటర్వూస్ లో తన అభిమాన నటుడు మమ్ముట్టి అని చెప్పిన విషయం అందరకీ తెలుసు.
ఈ నెల 15 నుంచి షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది.మమ్ముట్టి, సమంత ల నటన ఏ స్థాయిలో ఉంటుందో అందరకీ తెలుస్తుంది. దీంతో ఆ కాంబో వండర్ సృష్టించడం ఖాయం. అలాగే తెలుగులో అవకాశాలు తగ్గుతున్న వేళ సమంత కి మంచి అవకాశం అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో సామ్ మలయాళ సీమని ఏ అవకాశం కూడా లేకపోలేదు.