Table of Contents
మ్యూజిక్ షాప్ మూర్తి
జూన్ 14,
కామెడీ డ్రామా,
థియేటర్స్ లో
- నటినటులు:అజయ్ ఘోష్, చాందినీ చౌదరి, ఆమని, భాను చందర్ చేశారు
- దర్శకత్వం:శివ పాలడుగు
- నిర్మాత:హర్ష గారపాటి, రంగారావు గారపాటి
- సంగీతం:పవన్
- సినిమాటోగ్రఫీ:శ్రీనివాస్ బెజుగం
నటుడిగా అన్ని రకాల పాత్రలు చేస్తేనే ఇండస్ట్రీలో గుర్తింపుతో పాటుగా మంచి పేరు వస్తుంది. కొన్ని సార్లు ఏజ్ కు సరిపోని పాత్రల్లో కూడా నటించి, మెప్పించాల్సి ఉంటుంది. తాజాగా అలాంటి సాహసమే చేశాడు నటుడు అజయ్ ఘోష్. విలన్, కమెడియన్ గా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అజయ్ ఘోష్ తో పాటుగా చాందినీ చౌదరి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం జూన్ 14న విడుదలైంది. మరి వీరిద్దరు ఈ చిత్రంతో అభిమానులను మెప్పించారా? ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
మూర్తి(అజయ్ ఘోస్) వినుకొండలో ఓ మ్యూజిక్ షాప్ నడుపుతూ, క్యాసెట్లు అద్దెకి ఇస్తూ, ఫంక్షన్లకు సౌండ్ సెటప్ పెట్టి పాటలు ప్లే చేస్తున్నాడు. ఇక అతడి భార్య(ఆమని) కూడా జీవితాన్ని సాగిస్తుంటారు. మ్యూజిక్ షాప్ అమ్మేసి సెల్ షాప్ పెట్టుకుందామని భార్య ఎప్పుడూ గొడవపెడుతూ ఉంటుంది. అయితే ఓ సంఘటనతో తాను DJ కావాలని కంకణం కట్టుకుంటాడు. మరోవైపు అంజనా(చాందినీ) కూడా డీజే కావాలని కలలు కంటుంది. కానీ అది వాళ్ల నాన్న(భానుచందర్) కు ఇష్టముండదు. దానితో డీజే కన్సోల్(డీజే ప్లే చేసే వస్తువు)ను పగలగొడతాడు. దాన్ని బాగుచేసుకుంటే మూర్తి, అంజనాకు మధ్య స్నేహం ఏర్పడుతుంది. తనకు డీజే నేర్పిస్తాను అంటేనే ఆ పరికరాన్ని బాగుచేస్తానని అంజనాకి కండిషన్ పెడతాడు. మరి ఆమె మూర్తికి డీజే నేర్పించిందా? మూర్తి డీజేగా మారాడా? హైదరాబాద్ వచ్చి మూర్తి పడ్డ కష్టాలు ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఓ 50 ఏళ్ల వ్యక్తి డీజేగా మారాలనుకోవడం అన్న కథతోనే దర్శకుడు మూవీపై ఆసక్తి రేకెత్తించాడు. సినిమా మెదలైన 10 నిమిషాలు స్లోగా సాగినా.. ఆ తర్వాత స్పీడ్ అందుకుంటుంది. డీజేగా మారడానికి మూర్తి పడుతున్న కష్టాలు, ఆమె భార్య పోరు, మధ్య తరగతి అనుబంధాలను అద్భుతంగా రాసుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ లో మూర్తి, చాందినీల పరిచయం, డీజేలు కావాలని వారు పడుతున్న కష్టాలను, మధ్య మధ్యలో కామెడీతో ముందుకు తీసుకెళ్లాడు. ఇక ఇంటర్వెల్ సమయానికి ఓ ఎమోషనల్ టచ్ తో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాడు. సెకండాఫ్ లో మూర్తి డీజే ఎలా అయ్యాడు? అన్నదాన్ని బాగా ప్రదర్శించాడు. క్లైమాక్స్ తో డైరెక్టర్ కన్నీళ్లు తెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ తో కట్టిపడేశాడు. ముత్తానికి మ్యూజిక్ షాప్ మూర్తి మెస్మరైజ్ చేశాడనే చెప్పాలి.
నటి, నటుల పనితీరు:
ఈ చిత్రం మెయిన్ ఫిల్లర్ అజయ్ ఘోష్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు విలన్, కమెడియన్ గా నటించిన అతడు.. ప్రధాన పాత్రలో మూర్తిగా మెప్పించాడు. ఈ సినిమాకు తన పాత్రతో ప్రాణం పోశాడు. 50 ఏళ్ల మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటాడు? డీజేగా మారితే ఎలా ఉంటాడు? రెండు విభిన్న పాత్రల్లో మెప్పించాడు. ఇక చాందినీ చౌదరి కూడా తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. భానుచందర్, ఆమని తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ వస్తే.. కెమెరామెన్ పనితనం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్ద ప్లస్ పాయింట్. దర్శకుడిగా సినిమాతోనే డైరెక్టర్ శివ విజయం అందుకున్నాడనే చెప్పాలి. కథకు తగ్గట్లుగా నిర్మాణ విలువలు ఉన్నాయి.
బలాలు
- అజయ్ ఘోస్, చాందినీల నటన
- బ్యాగ్రౌండ్ స్కోర్
బలహీనతలు
- అక్కడక్కడ స్లో నెరేషన్
చివరి మాట: ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ డీజే బాగానే మోగించాడు.
(గమనిక): ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.