మొన్నటి వరకు ఏ సినిమా చూసినా అందులో హీరోయిన్ గా శ్రీలీల(sreeleela)నే మెరిసేది. ధమాకా తో మొదలైన ఆమె సినీ వేగం గుంటూరు కారం వరకు అప్రహాతీతంగా కొనసాగింది. కాకపోతే కొన్ని సినిమాలు పరాజయం చెందాయి. పైగా తన క్యారక్టర్ కి పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో డబ్బు కోసం చేసిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ విమర్శలకి సమాధానం చెప్పబోతోంది.
ఈ రోజు శ్రీలీల పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన అప్ కమింగ్ మూవీ రాబిన్ హుడ్ నుంచి చిన్నపాటి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ముప్పై ఆరు సెకన్ల నిడివి ఉన్న ఆ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఖరీదైన డ్రెస్, ఖరీదైన కళ్ళజోడుని ధరించిన శ్రీలీల ఫ్లైట్ లో నుంచి దిగుతుంది. అది పక్కా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ తో ఒక పెద్ద బిలినియర్ క్యారక్టర్ ని చెయ్యబోతుందనే విషయం అర్ధమవుతుంది. నడక తీరు, హుందాతనం కూడా చాలా రిచెస్ట్ గా ఉంది. తన వెంట వస్తున్న వెన్నెల కిషోర్ తో సునామీలో టి సైలెంట్ ఉండాలి.. నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలని అంటుంది. ఈ ఒక్క డైలాగ్ తో అర్ధం చేసుకోవచ్చు. శ్రీలీల ఎంత పవర్ రోల్ లో నటించబోతుందో అని. ఇక చివర్లో చుట్టూ ఎత్తైన కొండలు, వాటి కింద ప్రవహిస్తున్న ఒక నది.. అలాంటి ప్లేస్‌లో కాఫీ తాగుతూ డీల్ విత్ ది డెవిల్ అనే బుక్ చదువుతూ ఉంది. దీంతో ఆమె క్యారక్టర్ మీద అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. తనపై వస్తున్న విమర్శలకి చెక్ పెట్టేలా కూడా ఉంది. ఒక బడా బిజినెస్ ఉమెన్ అని కూడా చెప్పుకోవచ్చు. నీరా వాసుదేవ్ అనే నేమ్ తో సత్తా చాటనుంది.
నితిన్ (నితిన్)తో రెండో సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఈ కాంబోలో ఇంతకు ముందు ఇద్దరికీ ఆర్డినరీ మాన్ వచ్చింది. చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకుడు. నితిన్ బ్లాక్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బస్టర్ హిట్ గా నిలిచిన బీష్మ కి వెంకీ నే దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో నితిన్ అభిమానుల్లో ప్రేక్షకుల్లో మూవీ మీద పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.తమిళ అగ్ర దర్శకుడు జివి.ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఉన్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్.