మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమా నుంచి అభిమానుల కోసం క్రేజీ అప్ డేట్ అయితే వచ్చేసింది. ఎప్పటి నుంచో అభిమానులు ప్రస్తుతం కన్నప్ప సినిమా టీజర్ రానే వచ్చింది. గతనెల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ టీజర్ ని మొదట ప్రదర్శించారు. అంతర్జాతీయ వేదిక మీద తెలుగు సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ ట్రైలర్ ఎలా ఉంది? అలనాటి భక్త కన్నప్పను గుర్తు చేశాడా? అంతకు మించే ఉందా అనే విషయాలను చూద్దాం.
ఏదైనా పనిని మనం ఇష్టంతో చేస్తే దాని అవుట్ పుట్ లో ఆ ఇష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మంచు విష్ణుకు ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న ప్రేమ, ఇష్టం ఈ టీజర్ కళ్లకు కట్టినట్లు కనిపించింది. గతంలో మనం చూసిన కన్నప్ప సినిమా ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో వచ్చింది. కానీ, ఇప్పుడు వీఎఫ్ఎక్స్ అడ్వాన్స్డ్ కెమెరాలు అన్నీ వచ్చిన తర్వాత ఈ కన్నప్పను తీసుకురావడం కాస్త కొత్తగానే ఉంది. ఇంకా ఆ ఫీల్ మిస్ కాకుండా కన్నప్పను ఎంతో అద్భుతంగా చూపించారు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలను కూడా పరిచయం చేసింది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ సినిమాలో చేసే స్టార్స్ ని మనం చూస్తూనే ఉన్నాం.
ఇంక ఈ కన్నప్ప కథ విషయానికి వస్తే.. తెలుగు ప్రేక్షకులకు కన్నప్ప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఆ కన్నప్ప ఎలా చూపిస్తారు అంటే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో కన్నప్ప టీం వందకు వంద మార్కులు సాధించారు. ఎందుకంటే టేకింగ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది అనే విషయం అర్థమైపోయింది. ప్రస్తుతానికి ఫుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ చూపించారు. మధ్య మధ్యలో కన్నప్ప ధ్యానం ఉంటుంది, కాషాయం ధరించి ధ్యానం చూపించారు. ఇంకా రాబోయే అప్ డేట్స్ లో అసలు కథ, క్యారెక్టర్స్ ని పరిచయం చేసే అవకాశం ఉంది. మరి.. కన్నప్ప టీజర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.