కల్కి 2898 ఏడీ మూవీ గురించి ఒక్క తెలుగు ప్రేక్షకులకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కల్కి 2898 ఏడీ ట్రైలర్ దెబ్బకు మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా అభిమానులు తెగబడ్డారు. మూవీ రిలీజ్ కి ఇంకా రెండు వారాలే ఉంది. ఈలోపు కల్కి టీమ్ అప్ డేట్స్ తో హోరెత్తించాలని ఫిక్స్ అయిపోయారు. అందులో భాగంగానే ఇప్పుడు కల్కి సినిమా నుంచి భైరవ ఆంథమ్ ప్రోమో రిలీజ్ చేశారు. మరి.. భైరవ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ అంథమ్ ప్రోమో ఎలా ఉందో చూద్దాం. ఇది కచ్చితంగా వైరల్ స్టఫ్ అని చెప్పేయచ్చు.
కల్కి సినిమాకి ఇప్పటికే సూపర్ హైప్, క్రేజ్ వచ్చేశాయి. మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది అని క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు అంతా సినిమా రిలీజ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. అభిమానులను మరింత ఊరిస్తూ టీమ్ అప్ డేట్స్ మీద అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఈ భైరవ ఆంథం ప్రోమోతో ఫ్యాన్స్ లో క్రేజ్ మరో స్థాయికి వెళ్లిపోయింది. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్- పాన్ ఇండియా స్టార్ దిల్జిత్ దోసాంజ్ చేసిన హంగామా మాములుగా లేదు. ఈ ప్రోమో చూసిన తర్వాత కల్కి సినిమా మ్యూజిక్ మీద కూడా అంచనాలు ఓ రేంజ్ కి వెళ్లిపోయాయి. ఇందులో ప్రభాస్ మంచి స్టైలిష్ లుక్స్ తో ఇరగదీశాడు. ఇంక ఫుల్ సాంగ్ ని మాత్రం జూన్ 16న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈసారి కల్కి టీం చెప్పిన సమయానికంటే 8 నిమిషాల ముందే అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. మరి.. భైరవ అంతం ప్రోమో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
