టీవీ రియాలిటీ షోస్‌లో బిగ్‌బాస్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ షో అంటే టీవీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. దాంతో అన్ని భాషల్లోనూ ఈ షో గ్రాండ్ సక్సెస్ అయింది. తమిళ్‌లో కమల్ హాసన్, హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో సుదీప్ ఈ షోకు హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగు బిగ్‌బాస్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా రూపొందించబడింది. తెలుగులో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ గేమ్ షో ఇప్పుడు సీజన్ 8కి సిద్ధమవుతోంది. గత 5 సీజన్స్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఉన్నారు. అయితే చివరి సీజన్ అంటే సీజన్ 7కు మాత్రం అన్ని సీజన్‌ల కంటే ఎక్కువ టీఆర్‌పీ వచ్చింది.
రైతుబిడ్డగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఫైనల్ వరకు నిలబడి సీజన్ విన్నర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంది శివాజి, పల్లవి ప్రశాంత్ అనే చెప్పాలి. శివాజీ హౌస్‌లో ఉన్నవారిని కంట్రోల్ చేయడమే కాకుండా ప్రశాంత్‌కు సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. సీరియల్ బ్యాచ్ నుంచి పల్లవి ప్రశాంత్‌ను ప్రొటెక్ట్ చేస్తూ విన్నర్ అయ్యే వరకు అతనికి తోడుగా ఉన్నాడు శివాజీ. ఈ అందరి హౌస్‌లో ఉన్నవారితో గొడవలు కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు సీజన్ 8లో కూడా శివాజీ కనిపిస్తాడని సమాచారం. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం. ఈ సీజన్ కోసం కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతోంది. కాగా ఈసారి బిగ్‌బాస్ బజ్‌కు శివాజీ హోస్ట్‌గా ఉంటాడని తెలుస్తోంది. బిగ్ బాస్ బజ్‌కు మాజీ కంటెస్టెంట్స్ హోస్ట్‌గా ఉంటారు. బిగ్‌బాస్ సీజన్ 8కి శివాజీ హోస్ట్‌గా ఉంటాడనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.