తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు అన్ని సినిమాలలో నటించే హీరోల పేరు ముందు కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. వాటిని జనాలు ఆదరిస్తే ఒకే.. అయితే కొంతమందికి అవి సెట్ అవ్వవు.. వాటిని మూవీ లవర్స్ తీసుకోకపోతే ట్రోలింగ్ చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది.
సుధీర్ బాబు నటించిన హరోం హర మూవీ తాజాగా థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో హీరో సుధీర్ బాబు పేరు ముందు ‘నవదళపతి’ అనే ట్యాగ్ ఆడ్ చేశారు సినిమా మేకర్స్. ఆయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అతను నవదళపతా.. ఇదెప్పుడు పెట్టారంటూ తెగ ట్వీట్లు చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోలకు అంత ఈజీగా ట్యాగ్స్ వచ్చేవి కాదు. ఓ హీరోకి ఓ ట్యాగ్ రావాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కంటిన్యూగా హిట్లతో అభిమానుల్ని ఆకట్టుకోవాల్సి ఉండేది. అలా కంటిన్యూగా హిట్లు కొడుతూ దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తూ ఉంటే ప్రేమగా ఫ్యాన్స్ లేదా మీడియా లేదా ఇండస్ట్రీ వ్యక్తుల ట్యాగ్స్ ఇస్తుండేవారు. అలా చిరంజీవికి దశల వారిగా సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ వరకు ఎదిగాడు. విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్, మాస్ మహారాజ్ రవితేజ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, డార్లింగ్ ప్రభాస్, చాక్లెట్ బాయ్ రామ్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్స్ ఉన్నాయి. అలా ఒక్కో హీరోకి ఒక్కో ట్యాగ్ వచ్చింది. అది అభిమానులు లేదా ఇండస్ట్రీ ఇచ్చిన ట్యాగ్. ఎవరికి వారు పెట్టుకున్నది అయితే కాదు.
కానీ ఇప్పటి హీరోలు ఏదో ఒకటి పెట్టేసుకుంటున్నారు. అది ఎవరు ఇస్తున్నారు.. ఎందుకు ఇస్తున్నారన్నది కూడా ఎవ్వరికి తెలియడం లేదు. తాజాగా సుధీర్ బాబు తన పేరు ముందు నవ దళపతి అని పెట్టుకున్నాడు. దీనికంటే ముందు సుధీర్ బాబుకి నైట్రో స్టార్ అని ఉండేది. అసలు దాని మీనింగ్ ఏంటో.. ఆ ట్యాగ్ ఎవరు ఇచ్చారో కూడా తెలీదు. ఇప్పుడు ఇలా నవ దళపతి అంటూ పెట్టుకున్నాడు. సరైన హిట్లు లేని సుధీర్ బాబు ఇప్పుడు మరో వివాదంలో పడ్డాడు. ఈ ట్యాగ్స్ మీకు నచ్చినవి పెట్టుకుంటే ఎలా అన్నట్టు నెటిజన్లు సుధీర్ బాబుని ట్రోల్స్ చేస్తున్నారు.