స్టార్ హీరోయిన్ ‘జాన్వీ కపూర్’.. ఈ పేరు ప్రేక్షకులు అందరికి సుపరిచితమే. ఇంకా.. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారు మోగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే ఈ అందాల భామ ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ మహి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఇందులో రాజ్‌కుమార్ రావు సరసన జాన్వీ నటించింది. ఇక ఈ మూవీ గత నెల మే 31న థియేటర్లలో విడుదలైన బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకు వచ్చిన విమర్శలు వారితోనే ప్రశంసలు అందుకుంది జాన్వీ. కాగా, ప్రస్తుతం ఈ అమ్మడు డైరెక్టర్ కోరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘దేవర’ చిత్రంలో నటిస్తోంది. అలాగే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం తెలిసిందే .
ఇకపోతే వరుస సినిమాలతో దూసుకుపోతున్నా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తన అభిమానులతో టచ్ చేస్తూ.. తనకు సంబంధించిన వివిధ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇటీవలే ఈ బ్యూటీకి ఊహించని షాక్ తగిలింది. కాగా, ఈ జాన్వీ కపూర్ పేరుతో తన ఎక్స్ ఖాతాలో కొన్ని అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసినట్లు కనిపించింది. ఇక వాటిని ఫ్యాన్స్ ఒక్కసారిగా చూసిన ఆమె షాక్ అయ్యారు. ఇక ఈ విషయాన్ని గమనించిన జాన్వీకపూర్ టీం తాజాగా ఆ పోస్టులపై క్లారిటీ ఇచ్చింది. అలాగే అసలు ఆ ఎక్స్ ఖాతా జాన్వీది కాదని తేల్చి చెప్పింది.
అయితే మొదట ఎక్స్‌లో జాన్వీ పేరుతో ఉండే ఖాతాలో అందులో అలాంటి వీడియోలు రావడంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ, ఆ తర్వాత ఫ్యాన్ అకౌంట్ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే సోషల్ మీడియాలో మీడియాలో ఉండే నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాన్వీకపూర్ ప్రతినిధి సూచించారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఎవరి పేరుతోనైనా సృష్టించడం చాలా సులభమని.. జాన్వీ కపూర్ ఎక్స్‌లో ఎలాంటి అధికారిక ఖాతా లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. జాన్వీ త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన ఆర్సీ 16లో నటిస్తున్నది. మరి, జాన్వీ కపూర్ పేరుతో ఎక్స్ ఖాతాలో నకిలి అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.